Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL: మ్యాచ్ చూస్తుండగా గన్‌​తో కాల్పులు, యువకుడు మృతి

ఉత్తరప్రదేశ్ రాస్ట్రంలోని మీరఠ్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ చూస్తున్న 18 ఏళ్ల యువకుడిపైగా 13 ఏళ్ల మైనర్ బాలుడు తుపాకతో కాల్పులు జరిపాడు. దీంతో యువకుడి తలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పరీక్షిత్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజురి గ్రామానికి చెందిన ఓ కుటుంబం వివాహ వేడుక కోసం వేరే ఊరికి వెళ్లింది. అయితే, ఈ కుటుంబంలోని 13 ఏళ్ల బాలుడు మాత్రం ఇంట్లోనే ఉండిపోయాడు. శనివారం రాత్రి అతడు టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలోనే పొరుగింట్లో ఉన్న మహ్మద్ కైఫ్(18) కూడా మ్యాచ్ చూసేందుకు ఆ మైనర్ ఇంటికి వచ్చాడు.

IPL Young man dies after being shot while watching a match

ఇంట్లో వాళ్లిద్దూ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో సరదాగా మ్యాచ్ ను కలిసి చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలుడు తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీని తీసుకొచ్చి సరదాగా కైఫ్ వైపునకు గురిపెట్టాడు. అయితే, అందులో బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయని గ్రహించని బాలుడు.. ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో దాటంట్లోని బుల్లెట్ కైఫ్ తలలోకి నేరుగా దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత మైనర్ బాలుడు స్పహతప్పి పడిపోయాడు.

తుపాకీ పేలుడుతో ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మైనర్ దగ్గర ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మైనర్ స్పృహలోకి వచ్చిన తర్వాత పోలీసులు అతడ్ని స్టేషన్ కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.

మైనర్ బాలుడు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. తుపాకీకి లైసెన్స్ ఉందని, నిందితుడి తండ్రి పేరు మీద ఉందని తెలిపారు. మృతుడి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+