తక్కువలో irctc కాశ్మీర్ ప్యాకేజ్
ఎత్తయిన పర్వతాలు, ఎత్తయిన కొండల మధ్య రోప్ ప్రయాణం చేస్తుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. ఈ వేసవిలో చల్లచల్లగా కాశ్మీర్ వెళ్లాలనుకునేవారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కొత్త ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఆధ్యాత్మిక, విహార యాత్రలకు వివిధ ప్యాకేజీలను అందిస్తున్నఈ సంస్థ తాజాగా కాశ్మీర్ కోసం కొత్త ప్యాకేజీని తెచ్చింది.
మిస్టికల్ కాశ్మీర్ ఎక్స హైదరాబాద్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తున్నారు. మే 19వ తేదీ నుంచి జూన్ 30వ తేదీలోపు ఈ ప్రయాణానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచే ప్రయాణం ఉంటుంది. 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరుతుంది. ప్రస్తుతం మే 19, 26 తేదీలకు సంబంధించి టికెట్ల పూర్తయ్యాయి. జూన్ 9, 16, 23, 30 తేదీల్లో కొద్ది సంఖ్యలోనే టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు విమానం బయలుదేరుతుంది. 4.40 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. హోటల్ లో బస ఉంటుంది. సూర్యాస్తమయాన్ని చూడటానికి దాల్ సరస్సుకు తీసుకువెళతారు. రాత్రికి శ్రీనగర్ లోనే బస ఉంటుంది. రెండోరోజు సోన్ మార్గ్ చూపిస్తారు. మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, మంచుతో కప్పిన రోడ్లను చూసి ఆనందించవచ్చు. శ్రీనగర్ లోనే బస ఉంటుంది. మూడోరోజు గుల్ మార్గ్ వెళతారు. పూలతో నిండిన రహదారులతోపాటు రోప్ వే ప్రయాణం మిమ్మల్ని మైమరిపిస్తుంది. ఆరోజు కూడా శ్రీనగర్ లోనే బస ఉంటుంది. నాలుగోరోజు పహల్గామ్ వెళతారు. అక్కడ కుంకుమపువ్వు పంట, అవంతిపూర్ శిథిలాలు చూస్తారు. రాత్రికి పహల్గామ్ లోనే బస ఉంటుంది.
5వ రోజు శ్రీనగర్ కు వచ్చి మొఘల్ గార్డెన్స్, చెష్మషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ చూస్తారు. దాల్ సరస్సుతోపాటు హజ్రత్ బల్ ను చూడొచ్చు. రాత్రికి హౌస్ బోట్ లో బస ఉంటుంది. 6వ రోజు ఆదిశంకరాచార్య మందిర దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం షాపింగ్ ఉంటుంది. తర్వాత శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకొని 5.10 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరతారు. 8.05 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్రయాణానికి రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. సమయానికి మీరు విమానాన్ని అందుకోకపోతే ఐఆర్ సీటీసీ ఎటువంటి బాధ్యత వహించదు.సింగిల్ షేరింగ్ అయితే రూ.42,895, ట్విన్ షేరింగ్ అయితే రూ.38,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.36,845, 5-11 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులకు బెడ్ తో కలిపి రూ.28,430, బెడ్ లేకుండా అయితే రూ.25,750 చెల్లించాలి. 2 నుంచి 4 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులకు రూ.25,750 చెల్లించాలి.












Click it and Unblock the Notifications