డీకే ఏ రాష్ట్రానికి మంత్రి, తీరు చూస్తుంటే డౌట్ గా ఉంది, కావేరితో గేమ్స్ ?

బెంగళూరు: కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీరు చూస్తుంటే సిగ్గుగా ఉందని, ఆయన మంత్రిగా పని చేస్తున్నది కర్ణాటకకా, లేక తమిళనాడుకా అని అనుమానం వస్తోందని, కావేరి నీరు విడుదల చేసే విషయంలో డీకే శివకుమార్ తమిళనాడు సీఎం స్టాలిక్ కు లొంగిపోయారని కర్ణాటక మాజీ సీఎం హెచ.డీ. కుమారస్వామి ఆరోపించారు.

కావేరి నీటి వ్యవహారం కేంద్రం చేతిలో ఉందని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నదని, సిద్దరామయ్య, డీకే శివకుమార్ వ్యవహారం చూస్తుంటే కావేరీ కీ సోనియా గాంధీ చేతిలో ఉన్నట్లు ఉందని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి ఆరోపించారు. కావేరి నీరు తమిళనాడుకు విడుదల చేసే విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

DK Sivakumar

మేకేదాటు పాదయాత్ర హైడ్రామాతో కన్నడిగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుందని, ఇప్పుడు I.N.D.I.A.కి జీవం పోయ్యడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమిళనాడుకు కావేరి నీరు విడుదల చేయించి కన్నడిగులను మోసం చేసిందని కుమారస్వామి ఆరోపించారు. కావేరి నీరు విషయంలో కన్నడిగుల భయం నిజం అయ్యిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేసిందని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

DK Sivakumar

వర్షాలు పడకపోవడంతో చెరువులు ఎండిపోయాయని, రైతుల పంటకు నీరు లేదని, బెంగుళూరుకు తాగు నీరూ సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయం కర్ణాటకోని కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేస్తున్నదని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

DK Sivakumar

ఇండియా కూటమి నుంచి తమిళనాడు సీఎం స్టాలిన్ దూరం కాకూడదని సోనియా గాంధీ చక్రం తిప్పి సిద్దరామయ్య ప్రభుత్వం తమిళనాడుకు నీరు విడుదల చేసేలా స్కెచ్ వేశారని కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి ఆరోపించారు. 1962 నుంచి కర్ణాటక ప్రజలకు కావేరి నీటి విఫయంలో న్యాయం చెయ్యాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ పోరాటం చేస్తున్నారని, తరువాత కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు కావేరి నీటి కోసం తమిళనాడుతో పోరాటం చేస్తూ వచ్చాయని, అందుకే భిన్నంగా సిద్దరామయ్య ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ సీఎం హెచ్.డీ. కుమాస్వామి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+