వర్షంలో ఫుడ్ డెలివరీలపై వాయింపుడే

జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి ఇకపై అదనపు ఖర్చులు తప్పవు. ఇటీవల వస్తు సేవల పన్ను (GST) కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ-కామర్స్ డెలివరీ సేవలపై 18 శాతం జీఎస్టీ పడింది. సెప్టెంబర్ 22న ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 9(5) ప్రకారం, ఈ-కామర్స్ ఆపరేటర్లు అందించే సేవలపై జీఎస్టీని వారే చెల్లించాలి. ఈ నిబంధన డెలివరీ ఛార్జీలకూ వర్తిస్తుంది. అంటే- డెలివరీ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.

ఈ సందర్భంలగా స్విగ్గీ కొత్తగా "Rain Fee" పేరుతో అదనపు ఛార్జీని విధించడం మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన ఓ బిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చర్చకు దారితీసింది. ఓ ఎక్స్ యూజర్ ఈ బిల్ ను షేర్ చేశాడు. స్విగ్గీ బిల్లును స్క్రీన్‌ షాట్‌ తీసి తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 25 రూపాయల మొత్తాన్ని "రైన్ ఫీ"గా తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే- ఇతర జీఎస్టీ ఛార్జీలు కూడా ఇందులో ఉన్నాయి.

Is Swiggy and Zomato Charging GST on Rain Delivery Viral Post Sparks Debate

వర్షం పడుతున్న సమయంలో ఫుడ్ డెలివరీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సేవలకు అంతరాయం కలగకుండా ఈ రెయిన్ ఫీని వసూలు చేస్తున్నట్లు బిల్లులో వివరించారు. ఇది సోషల్ మీడియాలో డిబేట్ కు దారి తీసింది. చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణల తర్వాత, ఇంద్రదేవుడు కూడా పన్ను పరిధిలోకి వచ్చాడన్న మాట అని ఓ యూజర్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు వర్షం పడితే.. ఈ- కామర్స్, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలకు రూ. 25 రైన్ ఫీ + 18% జీఎస్టీ = రూ. 29.50 పడుతుంది.

దీని తరువాత, సన్ లైట్ ఫీజు, ఆక్సిజన్ మేనేజ్మెంట్ ఛార్జీ, ఊపిరి పీల్చుకోవడం, వదలడంపైనా జీఎస్టీ తప్పకపోవచ్చు.. అని సెటైరికల్ గా రాసుకొచ్చాడు. నెక్స్ట్ కమింగ్ అప్: కాలింగ్ బెల్ ఫీ, పెట్రోల్/డీజిల్/గ్యాస్ ఫీ, రైడర్స్ వెహికల్ ఈఎంఐ ఫీ, గుంతల నివారణ ఫీ, ట్రాఫిక్ వెయిట్ ఫీ" అని మరొకరు కామెంట్స్ పెట్టాడు.

ఫ్యూచర్ లో స్మైలింగ్ ట్యాక్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని మరో యూజర్ చెప్పుకొచ్చాడు. కనురెప్ప కొట్టినందుకు 'బ్లింక్ ఛార్జ్' కూడా వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని, ఒక తుమ్ము తుమ్మినందుకు- రూ. 5 హెల్త్ సెస్ + 18% జీఎస్టీ' వసూలు చేస్తారేమోనని సెటైరికల్ పోస్ట్ పెట్టాడు.

ఒక యూజర్ ఈ ఫీజును సమర్థించాడు. డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేశాడు. వర్షాల సమయంలో చాలామంది డెలివరీ బాయ్స్ రావట్లేదని, యాప్‌లు స్విచ్ ఆఫ్ చేస్తుంటారని పేర్కొన్నాడు. అలాంటి సమయంలో వారికి కంపెనీ ప్రోత్సాహకాలు ఇవ్వాలే తప్ప వినియోగదారుల నుంచి తీసుకోవడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+