Chandrayaan 3: భగవంతుడి ఆశీర్వాదం అవసరం: ఇస్రో ఛైర్మన్

అహ్మదాబాద్: చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడం, ఆ తరువాత ప్రయోగించిన ఆదిత్య ఎల్1.. తన గమ్యస్థానం వైపు దూసుకెళ్తోన్న నేపథ్యంలో- మరిన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. శుక్రగ్రహంపై ప్రయోగాలకు పూనుకుంది. శుక్రయాన్ మిషన్‌ను తెరపైకి తీసుకొచ్చింది.

శుక్రగ్రహం వాతావరణం, ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా వీనస్ ఆర్బిటర్ మిషన్‌ను ఆ గ్రహంపైకి పంపించనుంది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. పేలోడ్స్ అన్నీ సిద్ధమౌతున్నాయి. 2024 నవంబర్/డిసెంబర్‌లల్లో ఈ ఆర్బిటర్‌ను శుక్రగ్రహంపైకి పంపించే అవకాశాలు ఉన్నాయి.

ISRO Chief S Somnath offers prayers at Somnath temple

దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. వీనస్‌ ఆర్బిటర్ మిషన్‌కు సంబంధించిన పేలోడ్‌లను ఇప్పటికే అభివృద్ధి చేశామని తెలిపారు. శుక్రగ్రహం వాతావరణం, ఉపరితలాన్ని అధ్యయనం చేయడం దీని ముఖ్య ఉద్దేశమని అధ్యయనం చేశారు. వీనస్‌ను అధ్యయనం చేయడం వల్ల అంతరిక్ష రంగంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని వ్యాఖ్యానించారు.

ఈ మధ్యాహ్నం ఆయన గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. సోమనాథేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో గడిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. భగవంతుడి ఆశీస్సులతో చంద్రయాన్ 3ని సాఫ్ట్ ల్యాండ్ చేయగలిగామని అన్నారు.

ISRO Chief S Somnath offers prayers at Somnath temple

శుక్రయాన్ సహా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టబోతోన్నామని, వాటికీ మహాదేవుడి ఆశీస్సులు అవసరమని చెప్పారు. చంద్రయాన్ 3 పేలోడ్స్ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. ప్రస్తుతం నిద్రావస్తలో ఉండటం పట్ల స్పందించారు. మరోసారి వాటిని యాక్టివ్ మోడ్‌లోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తామని అన్నారు.

2016లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వీనస్ మిషన్‌ను చేపట్టింది. జపాన్‌ కూడా శుక్రగ్రహంపై ప్రయోగాలకు దిగింది. జపాన్ ప్రయోగించిన అకాట్సుకి వీనస్ క్లైమేట్ ఆర్బిటర్ అధ్యయనంలో నిమగ్నమైంది. వీనస్‌పై ప్రయోగాలకు నాసా ఫ్లైబై సహా పలు మిషన్‌లను ప్రయోగించింది. 2029, 2030, 2031లో నాసా మరిన్ని ప్రయోగాలకు సిద్ధపడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+