Chandrayaan -3 : చందమామపై లోతైన బిలాలు - ఇస్రో అరుదైన వీడియో...!!

చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది.ఇప్పటికే చంద్రుడికి అతి చేరువలోకి వెళ్లిన స్పేస్‌ క్రాఫ్ట్‌ తాజాగా ఒక వీడియోను రికార్డు చేసి పంపింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ చిత్రాల్లో చందమామ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇస్రో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తోందంటూ ట్విట్టర్‌లో ఇస్రో వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో చంద్రుడు అతి దగ్గరగా కనిపిస్తున్నాడు. చంద్రుడి ఉపరితలంపై గల బిలాలు కనిపిస్తున్నాయి. చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలో తిరుగుతుండగా ఈ వీడియో తీసింది. వెలుగు వైపు నుంచి చంద్రుడికి చీకటి వైపు వెళ్లుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపించింది.

ISRO on released a video of the Moon as viewed by Chandrayaan-3

ఆగస్టు 1వ తేదీన చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. అనంతరం శనివారం రాత్రి 7 గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది. లూనర్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని, చంద్రయాన్‌-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకళ్తారు. తదనంతరం ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు.

చంద్రయాన్‌-3ని చంద్రుడికి మరింత దగ్గర చేసే దిశగా ఈ నెల 9న మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 9న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. చివరిలో చంద్రుడికి 100 కి.మీలో ఎత్తున ఉన్న దీర్ఘవృత్తకార కక్ష్యలోకి చంద్రయాన్‌3ని ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉంటే చంద్రయాన్ 3 చంద్రుడి చుట్టూ మొదటి రౌండ్ ను పూర్తి చేసింది. మరో ఐదు రౌండ్లు పూర్తి చేసిన తర్వాత ల్యాండ్ కానున్న ల్యాండర్. చంద్రుడికి దగ్గరగా 170 కి.మీ, దూరంగా 4313 కి.మీ దూరంలో చంద్రయాన్ 3 ఉంది. ఇక 23వ తేదీన జాబిల్లిపై ల్యాండ్‌ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+