ISRO’s 100th Mission:ఇస్రో 100వ మిషన్.. మరి కొద్ది గంటల్లో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో సెంచరీ కొట్టేందుకు సిద్ధమైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ శాటిలైట్ ను మరికొద్ది గంటల్లో ప్రయోగించనుంది. ఇస్రో ఛైర్మన్ గా వి. నారాయణన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయోగిస్తున్న ఉపగ్రాహం ఇదే కావడం విశేషం. ఈ GSLV మిషన్ ను ఇస్రో.. బుధవారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నింగిలోకి ప్రయోగించనుంది.

ఇస్రో దేశీయంగా అభివృద్ధి చేసిన GSLV-F15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే భారత నేవిగేషన్ వ్యవస్థ మరింత బలపడనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 50.9 మీటర్ల పొడవున్న GSLV-F15 రాకెట్.. GSLV-F12 మిషన్ కు కొనసాగింపుగా ఉంది. ఇక NVS-02 ఉపగ్రహాన్ని యూఆర్ శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీని బరువు 2,250 కేజీలు ఉంది.

ISRO s Historic 100th Mission A New Dawn for Space Exploration

నావిక్ అనేది దేశానికి సంబంధించిన నేవిగేషన్ వ్యవస్థ. అమెరికాకు GPS ఎలానో భారత్ కు నావిక్ అలా. ఈ వ్యవస్థ పరిధి భారత భూభాగం నుంచి 1500 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వ్యవస్థ వల్ల మనకు కచ్చితమైన సమయం, వేగం.. లాంటివి తెలుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+