ఫ్రీగా పిజ్జాలు.. 2 వేల మంది ఇస్రో శాస్త్రవేత్తలకు.. పిజ్జా హట్ స్పెషల్ ట్రీట్
ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న 2 వేల మంది ఇస్రో ఉద్యోగులకు ఉచితంగా పిజ్జాలను ఆఫర్ చేసింది పిజ్జా హట్.
బెంగళూరు: ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు పిజ్జాలతో తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇస్రో సాధించిన ఘనతకు శుభాకాంక్షలు చెబుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో ఉద్యోగులకు ఉచితంగా పిజ్జాలను ఆఫర్ చేసింది పిజ్జా హట్.
ఆ ఉద్యోగులందరినీ తమ ఔట్ లెట్స్ కు వచ్చి ఫ్రీ పిజ్జాలను ఎంజాయ్ చేయమని పిజ్జా హట్ ట్విట్టర్ లో ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న 2 వేల మంది ఇస్రో ఉద్యోగులకు రూ.6 లక్షల విలువైన పిజ్జాలను పిజ్జా హట్ ఆఫర్ చేసింది.

ఈ ఆఫర్ ను ప్రశంసిస్తూ ఎంతోమంది ట్వీట్స్ చేశారు. ఈనెల 15న పీఎస్ఎల్వీ-సి37 రాకెట్ లో 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపింది ఇస్రో. దీంతో 37 ఉపగ్రహాలతో గతంలో రష్యా పేరిట ఉన్న రికార్డు మరుగున పడిపోయింది.
పిజ్జా హట్ ఇప్పడు ఇస్రో ఉద్యోగులకే కాదు.. గతంలో నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడిన వారికి, బ్యాంకు సిబ్బందికి కూడా ఉచితంగా పిజ్జాలు పంచి పెట్టింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications