PSLV-C60: రాత్రి పీఎస్ఎల్వీ -సీ60 ప్రయోగం నేడే.. ఇప్పటికే స్టార్ట్ అయిన కౌంట్ డౌన్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో సోమవారం (డిసెంబర్ 30) పీఎస్ఎల్వీ సి60 రాకెట్ ను ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ప్రారంభం అవుతుందని తెలిపింది. సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రయోగానికి 25 గంటల ముందు అంటే ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు.రాకెట్ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ కు చెందిన స్పాడెక్స్ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ-సీ60లో స్పాడెక్స్ మిషన్‌లో ఎస్డీ ఎక్స్01 (ఛేజర్), ఎస్డీ ఎక్స్02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయని పేర్కొంది.

ISRO to start countdown today for PSLV C60 launch on Monday

ఒక్కొక్కటి సుమారు 220 కిలోల బరువు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహాలను 470 కి.మీ ఎత్తులో తక్కువ-భూమి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగాన్ని పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆదివారం రాత్రికి బెంగళూరు నుంచి షార్‌కు చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇస్రోకు ఇది 62వ ప్రయోగం. అలాగే పీఎస్‌ఎల్‌వీ కోర్‌ అలోన్‌ దశతో చేసే 18వ ప్రయోగమని తెలుస్తోంది.

ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనం మండించడంతో ప్రయోగం చేయనున్నారు. భవిష్యత్తులో నిర్వహించే చంద్రయాన్‌-4లో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన డాకింగ్‌ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+