ISRO: కాసేపట్లో ఇస్రో ప్రయోగం.. ఒకేసారి నింగిలోకి 36 ఉపగ్రహాలు..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) కాసేపట్లో జీఎస్ఎల్ వీ మార్క్3-ఎం3 రాకెట్ ను ప్రయోగించనుంది. దీని ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ
ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసింది. ఇస్రో కమర్షియల్ బాట పట్టిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తోంది.

ఈ క్రమంలో ఒకేసారి 36 ఉపగ్రహాలను (Satellites) అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. అవన్నీ వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు. బ్రాడ్ బ్యాండ్ (Broad Band) సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్ వర్క్ శాటిలైట్లను ప్రయోగించడానికి ఇస్రో సహకారాన్ని తీసుకోనుంది వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్. ఇది- బ్రిటన్ కు చెందిన కంపెనీ. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో వన్ వెబ్ ఒకటి. మొత్తంగా 72 శాటిలైట్లను లో-ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడానికి ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications