హీరోయిన్ రష్మిక మందన్నకు సంక్రాంతి షాక్, ఐటీ సోదాలు, ఐటీ నోటీసులు!
Recommended Video
బెంగళూరు: దక్షిణాది సినీ పరిశ్రమంలో ఓ వెలుగు వెలుగుతున్న ప్రముఖ అగ్ర కథానాయిక, కన్నడ అందాల భామ రష్మిక మందన్నకు సంక్రాంతి పండుగ సందర్బంగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాక్ ఇచ్చారు. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని మడికేరి, వీరాజపేట, బెంగళూరు నగరంతో సహ సుమారు 10 చోట్ల రష్మిక మందన్నకు చెందిన ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు ముమ్మరం చేసింది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న సమయంలో ఐటీ శాఖ అధికారులు రష్మిక మందన్నకు సమన్లు జారీ చేసి సమాధానం చెప్పాలని ఆదేశించారు.

పండగ రోజు షాక్
కర్ణాటకలోని కొడుగు జిల్లా వీరాజపేటలోని కుక్లూరి (కూర్గ్)లో ప్రముఖ నటి రష్మిక మందన్న కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు బహుబాష నటి రష్మిక మందన్న ఇంటిలో దాడులు చేసి సోదాలు చేస్తున్నారు.

ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు?
2016లో రష్మిక మందన్న సినీ రంగంలో అడుగుపెట్టారు. కన్నడలో కిరాక్ పార్టీ, అంజనీపుత్ర, చమక్ తదితర సినిమాల్లో రష్మిక మందన్న నటించారు. ఇక తెలుగులో గీతా గోవిందం, దేవదాస్, మిస్టర్ కామ్రేడ్, భీష్మాతో పాటు అనేక సినిమాల్లో నటించింది. రష్మిక మందన్న ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని సమాచారం అందడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారని తెలిసింది.

‘రష్మిక 'సరిలేరు నీకెవ్వరు
తెలుగు, కన్నడ, తమిళ బాషా చిత్రాలతో మంచి దూకుడు మీద ఉన్న రష్మిక మందన్న ప్రముఖ హీరోల సినిమా ఆఫర్లు పట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రష్మిక మందన్న నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా గత శనివారం విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా విజయం సాధించడంతో మంచి జోష్ మీద ఉన్న రష్మిక మందన్నకు అదే పండుగ సందర్బంగా ఐటీ శాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.

రష్మిక మందన్నకు ఐటీ సమన్లు
హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లతో బిజిబిజీగా ఉన్న ప్రముఖ కథానాయిక రష్మిక మందన్నకు మైసూరు విభాగం ఆదాయ పన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. వెంటనే వీరాజపేట (కూర్గ్) వచ్చి తమకు సమాధానం ఇవ్వాలని ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆదాయ పన్ను శాఖ దాడుల సందర్బంగా వివరాలు చెప్పడానికి ఐటీ శాఖ అధికారులు, రష్మిక మందన్న కుటుంబ సభ్యులు నిరాకరించారు. మొత్తం మీద సంక్రాంతి సంబరాల వేళ ఐటీ శాఖ అధికారులు రష్మిక మందన్నకు ఊహించని షాక్ ఇచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications