బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: ఉగండా, నగర బహిష్కరణ, రెడ్డి ఆదేశాలతో, విదేశీయులు ఎక్కడ ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో అక్రమంగా మకాం వేసిన విదేశీయులను నగర బహిష్కరణ చెయ్యాలని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులో అక్రమంగా మకాం వేసిన విదేశీయుడిని అతని స్వదేశానికి పంపించిన పోలీసు అధికారులు అక్రమంగా బెంగళూరులో మకాం వేసిన విదేశీయులను నగర బహిష్కరణ చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. బెంగళూరులో అక్రమంగా మకాం వేసిన విదేశీయులను గుర్తించి నగర బహిష్కరణకు రంగం సిద్దం చేశామని, వాళ్ల దేశానికి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని సిటీ పోలీసు అధికారులు తెలిపారు.

Illegal affair: భర్తతో ఢిష్యూం ఢిష్యూం, ప్రియుడితో నాలుగో బిడ్డకు ?, ఇంటి వెనుక?, ఆంటీ, కూతురు !Illegal affair: భర్తతో ఢిష్యూం ఢిష్యూం, ప్రియుడితో నాలుగో బిడ్డకు ?, ఇంటి వెనుక?, ఆంటీ, కూతురు !

 ఉగండా టూ బెంగళూరు

ఉగండా టూ బెంగళూరు

బెంగళూరు నగరంలో అక్రమంగా మకాం వేసిన విదేశీయుల కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు నగరంలోని ఉగాండాకు చెందిన బోస్కో కావ్సేసీ అలియాస్ బోస్కో అనే వ్యక్తి బెంగళూరులోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగరాజపురంలోని అద్దె ఇంటిలో చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు.

 కోర్టు అనుమతితో !

కోర్టు అనుమతితో !

బోస్కో అతని వీసా గడువు పూర్తి అయినా బెంగళూరు నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్నాడని పోలీసు అధికారులకు సమాచారం అందింది. బెంగళూరు 11వ ఏసీఎంఎం న్యాయస్థానం అనుమతితో చర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు బోస్కో ఇంటిలో సోదాలు చేశారు. బోస్కో ఇంటిలో ల్యాప్ టాప్, డీఎల్, బ్యాంక్ అకౌంట్ బుక్ లు, పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు.

 17 ఏళ్ల నుంచి మకాం

17 ఏళ్ల నుంచి మకాం

17 సంవత్సరాల క్రితం బెంగళూరు వచ్చిన బోస్కో అతని వీసా గడుపు పూర్తి అయినా బెంగళూరులోనే మకాం వేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. వీసా గడుపు పూర్తి అయినా బెంగళూరులోనే మకాం వేసిన బోస్కోను అరెస్టు చేసి జైలుకు పంపించామని పోలీసులు అధికారులు వివరించారు.

 బెంగళూరు నగర బహిష్కరణ

బెంగళూరు నగర బహిష్కరణ

ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన బోస్కో తరువాత బయటకు వచ్చాడని, అతని సొంత దేశానికి వెళ్లిపోతానని కోర్టుకు, పోలీసులకు చెప్పినా అతను బెంగళూరులోనే అక్రమంగా నివాసం ఉంటున్నాడని పోలీసులు అధికారులు తెలిపారు. బెంగళూరు నగర పోలీసు కమీషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు బోస్కో బెంగళూరు నగరంలో అడుగుపెట్టడానికి వీలు లేదని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులో అక్రమంగా మకాం వేసిన విదేశీయులను గుర్తించి నగర బహిష్కరణకు రంగం సిద్దం చేశామని, వాళ్ల దేశానికి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని సిటీ పోలీసు అధికారులు తెలిపారు.

English summary
IT Hub: Uganda man who living illegally in Bengaluru city deported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X