Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IT Hub: అర్దరాత్రి వరకు ఫ్రెండ్ రూమ్ లో, క్యాబ్ లో ఇంటికి వెలుతుంటే యువతిని రేప్ చేసిన డ్రైవర్ !

బెంగళూరు/ తిరుపతి: ఉద్యోగం చెయ్యడానికి ఐటీ హబ్ చేరుకున్న యువతి ఫ్రెండ్స్ తో కలిసి నివాసం ఉంటున్నది. అప్పుడప్పుడు ఆ యువతి స్నేహితులు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్స్ కు వెళ్లి వస్తోంది. రాత్రి స్నేహితుల ఫ్లాట్ కు వెళ్లిన యువతి అర్దరాత్రి దాటిన తరువాత కూడా అక్కడే ఉంది. వేకువ జామున ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. స్నేహితుల అపార్ట్ మెంట్ దగ్గర క్యాబ్ ఎక్కిన యువతిని వేరే మార్గంలో పిలుచుకుని వెళ్లిన క్యాబ్ డ్రైవర్ నిర్జనప్రదేశంలో కారు నిలిపేశాడు. కారు డోర్ లాక్ చేసిన క్యాబ్ డ్రైవర్ వెనుక సీటులో కుర్చుకున్న యువతి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. కామాంధుడి నుంచి తప్పించుకోవడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేసింది. క్యాబ్ డోర్ లు మొత్తం సెంట్రల్ లాక్ చెయ్యడంతో ఆ యువతి తప్పించుకోలేకపోయింది. చివరికి యువతి మీద అత్యాచారం చేసిన కామాంధుడు ఆమె నివాసం ఉంటున్న ఇంటి రోడ్డు పక్కన ఆమెను తోసేసి పరారైనాడు. యువతి ఫిర్యాదు చెయ్యడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ను పట్టుకున్న పోలీసులు అతని నరాలు పిండేసి వివరాలు సేకరిస్తున్నారు.

 ఫేమస్ హోటల్ లో ఉద్యోగం

ఫేమస్ హోటల్ లో ఉద్యోగం

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యువతి ఉద్యోగం చెయ్యడానికి ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురగేష్ పాళ్యలో ఫ్రెండ్స్ తో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది. ఓ ఫేమస్ హోటల్ లో ఉద్యోగం చేస్తున్న ఆ యువతి అప్పుడప్పుడు స్నేహితుల నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్స్ కు వెళ్లివస్తోంది.

 అర్దరాత్రి వరకు ఫ్రెండ్స్ అపార్ట్ మెంట్ లో

అర్దరాత్రి వరకు ఫ్రెండ్స్ అపార్ట్ మెంట్ లో

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో ఆ యువతి ఫ్రెండ్స్ నివాసం ఉంటున్నారు. సాయంత్రం క్యాబ్ బుక్ చేసుకున్న ఆ యువతి హెచ్ఎస్ఆర్ లేఔట్ లో ఆ యువతి ఫ్రెండ్స్ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోకి వెళ్లింది. స్నేహితుల ఫ్లాట్ కు వెళ్లిన యువతి అర్దరాత్రి దాటిన తరువాత కూడా అక్కడే ఉంది. వేకువ జామున ఆమె నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది.

 కామాంధుడి క్యాబ్ లో ప్రయాణం

కామాంధుడి క్యాబ్ లో ప్రయాణం

వేకువ జామున 3. 30 గంటల సమయంలో హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని ఓ అపార్ట్ మెంట్ దగ్గరకు దేవరాజులు అనే క్యాబ్ డ్రైవర్ వెళ్లాడు. హెచ్ఎస్ఆర్ లేఔట్ నుంచి మురగేశ్ పాళ్యలకు ఆ యువతి ముందుగానే క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ నెంబర్ చూసుకున్న యువతి దేవరాజులు కారులో కుర్చుంది.

 కార్ డోర్స్ లాక్ చేసిన డ్రైవర్

కార్ డోర్స్ లాక్ చేసిన డ్రైవర్

స్నేహితుల అపార్ట్ మెంట్ లో క్యాబ్ ఎక్కిన యువతిని వేరే మార్గంలో పిలుచుకుని వెళ్లిన క్యాబ్ డ్రైవర్ దేవరాజులు జీవన్ భీమానగర్ సమీపంలోని నిర్జనప్రదేశంలో కారు నిలిపేశాడు. కారు డోర్ లాక్ చేసిన క్యాబ్ డ్రైవర్ దేవరాజులు వెనుక సీటులో కుర్చుకున్న యువతి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. కామాంధుడు దేవరాజ్ నుంచి తప్పించుకోవడానికి ఆ యువతి అనేక ప్రయత్నాలు చేసింది.

 మొబైల్ లాక్కొని...... రేప్ చేసి ఎస్కేప్

మొబైల్ లాక్కొని...... రేప్ చేసి ఎస్కేప్

క్యాబ్ డోర్ లు మొత్తం సెంట్రల్ లాక్ చెయ్యడంతో ఆ యువతి తప్పించుకోలేకపోయింది. యువతి ఆమె ఫ్రెండ్స్ కు ఫోన్ చెయ్యకుండా డ్రైవర్ దేవరాజులు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొన్నాడు. ఆ సమయంలో ఆ రోడ్డులో ఎవ్వరూ రాకపోవడంతో యువతి మీద అత్యాచారం చేసిన కామాంధుడు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ రోడ్డు పక్కన ఆమెను తోసేసి పరారైనాడు.

 పోలీసులకు చిక్కిపోయిన కామాంధుడు

పోలీసులకు చిక్కిపోయిన కామాంధుడు

అత్యాచారానికి గురైన బాధితురాలు జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి క్యాబ్ డ్రైవర్ కోసం గాలించారు. బెంగళూరులోని బయ్యప్పనహళ్ళి పోలీసులు క్యాబ్ డ్రైవర్ దేవరాజులను అరెస్టు చేశారని బెంగళూరు సిటీ అడిషనల్ పోలీసు కమీషనర్ ఎస్. మురుగన్ చెప్పారు.

Recommended Video

    AP: 16 Health Hubs, Quality Medical Care పెద్ద నగరాలకు వెళ్ళక్కర్లేదు AP CM Jagan
     ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్

    ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్

    ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేవరాజులు బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడని, అతని నుంచి యువతి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సిటీ అడిషనల్ పోలీసు కమీషనర్ ఎస్. మురుగన్ అన్నారు. యువతిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. క్యాబ్ డ్రైవర్ ను పట్టుకున్న పోలీసులు అతని నరాలు పిండేసి వివరాలు సేకరిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+