అత్తతో అక్రమ సంబంధం, అల్లుడిని చంపేసి ఏం ప్లాన్ చేశాడంటే ? మామా మజకా !
దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న కూతురు ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. భర్తతో కలిసి ఆమె పుట్టింటికి వచ్చి వెలుతోంది. ఇంటికి వచ్చి వెలుతున్న అల్లుడు తన అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మామకు అనుమానం మొదలైయ్యింది. తరువాత నడిరోడ్డులో అల్లుడు శవమై కనపించాడు.
కర్ణాటకలోని బెళగావి జిల్లా రామదుర్గ తాలుకాలోని సున్నాళ గ్రామంలో నీలప్ప అలియాస్ నీలు (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నీలు నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోని గ్రామంలో పకీరప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పకీరప్పకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. పకీరప్ప, నీలు దూరపు బంధువులు. రెండు సంవత్సరాల క్రితం పకీరప్ప కుమార్తెను నీలుకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు.

రెండు సంవత్సరాల క్రితం పకీరప్ప కుమార్తెతో నీలు వివాహం జరిగింది. పరిసర ప్రాంతాల గ్రామాల్లోనే నివాసం ఉంటున్న పకీరప్ప, నీలు కుటుంబ సభ్యులు ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చి వెలుతున్నారు. భార్యతో కలిసి నీలు అతని అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. భార్య లేని సమయంలో కూడా నీలు అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. కూతురిని ఇంటిలో వదిలేసి తన అల్లుడు ఎక్కువగా తన ఇంటికి వచ్చి వెలుతున్నాడని పకీరప్పకు అనుమానం మొదలైయ్యింది.
తన భార్యతో తన అల్లుడు నీలు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అందుకే నేను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి ఎక్కువగా వచ్చి వెలుతున్నాడని పకీరప్పకు అనుమానం వచ్చింది. తన అల్లుడిని అంతం చేస్తే తన కూతురి జీవితం, తన కాపురం నిలబడుతుందని పకీరప్ప అనుకున్నాడు. ఎలాగైనా అల్లుడు నీలును అంతం చెయ్యాలని పకీరప్ప ప్లాన్ చేశాడు.

శుక్రవారం అల్లుడు నీలును నిర్జనప్రదేశంలోకి పిలిపించుకున్న పకీరప్ప అతనితో గొడవపెట్టుకున్నాడు. తరువాత నీలు తల మీద ఇనుపరాడ్ తో దాడి చేసి అతని గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత అల్లుడు నీలు బైక్ ను రోడ్డు మీద పడేసి ఆ బైక్ మీద ఇనుపరాడ్ తో దాడి చేశాడు. అనంతరం అల్లుడు నీలు శవాన్ని తీసుకెళ్లి బైక్ పక్కన పడేసి అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించిన పకీరప్ప అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు నీలు తలమీద బలమైన గాయాలు ఉండటంతో పలుకోణాల్లో విచారణ చేశారు. నీలు మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ చేసిన పోలీసులు పకీరప్పను అదుపులోకి తీసుకున్నారు. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నీలును అతని మామ హత్య చేశాడని వెలుగు చూసిందని, పకీరప్పను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెళగావి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications