కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన ఐటీ శాఖ: మాజీ సీఎం, మంత్రి డీకే సన్నిహితుడి ఇంటిలో సోదాలు !
కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితుడు విజయ్ ముళగుంద్ ఇంటిలో బుధవారం ఉదయం ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితుడు విజయ్ ముళగుంద్ ఇంటిలో బుధవారం ఉదయం ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు.
బెంగళూరులోని సుబ్రమణ్య నగర, రాజాజీనగరలోని విజయ్ ముళగుంద్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విలాస్ రావ్ దేశ్ ముఖ్ కు విజయ్ ముళగుంద్ అత్యంత సన్నిహితుడు.

గతంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరులోని రిసార్ట్ రాజకీయాలకు వచ్చిన సమయంలో విజయ్ ముళగుంద్ వచ్చారు. ఆ సందర్బంలో డీకే. శివకుమార్ కు విజయ్ ముళగుంద్ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు.
అప్పటి నుంచి మంత్రి డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితుల్లో విజయ్ ముళగుంద్ ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్బంగా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు బెంగళూరు నగర శివార్లలోని రిసార్ట్ కు చేరుకున్న విషయం తెలిసిందే.
అదే సమయంలో ఆగస్టు 3వ తేదీన డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. 27 రోజుల తరువాత మళ్లీ డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితుడైన విజయ్ ముళగుంద్ ఇంటిలో మళ్లీ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications