రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ఐటీ సోదాలు: సన్నిహితుల వద్ద రూ. 6కోట్లు సీజ్
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. అదీ గాక రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సన్నిహితుల నివాసాల్లోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం.
ఢిల్లీ, కోటా, జైపూర్, ముంబైలలోని సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ కుమారుడి వ్యాపార భాగస్వామి రతన్ కాంత్ శర్మ లాకర్‌లోని రూ. 5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలో జరిపిన ఐటీ దాడుల్లో ఆ శాఖ రూ. 12 కోట్లు నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. లెక్కల్లోకి రాని రూ. 1.7 కోట్ల విలువైన ఆభరణాలను ఈ ఐటీ సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు.
ఇది ఇలావుండగా, కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్‌కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సచిన్ పైలట్ సహా 18 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహిత్గీ వాదించారు. జులై మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో సచిన్ పైలట్ తోపాటు 18 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications