ఫేమస్ నటి భర్త, బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ లీక్ చేసిన మేడమ్ కారు డ్రైవర్, ఒకేసారి !

బెంగళూరు/తిరువనంతపురం: బహుభాషా నటి, కన్నడలో గజ, దృశ్యం, దృశ్యం 2', నమ్మ యజమన్రు తదితర సినిమాల్లో నటించి స్యాండిల్ వుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్యా నాయర్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో కథానాయికగా కూడా నటించిన నవ్యా నాయర్ ఒక ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌తో లింక్ పెట్టుకుని ఇప్పుడు ఇబ్బందుల్లోపడింది.

ఇటీవల అక్రమ ఆస్తులు సంపాదించారని, అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడ్డాడనే కేసులో అరెస్టు అయిన ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్‌తో ప్రముఖ నటి నవ్యా నాయర్ పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. అక్రమాస్తుల ఆరోపణలపై ఇప్పటికే సచిన్ సావంత్‌ను ఈడీ అరెస్టు చేసి ఆయన్ను జైల్లో పెట్టింది. ఇదే కేసు విచారణకు హాజరు కావాలని బహుబాష నటి నవ్యా నాయర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

amous actress

ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్ మనీలాండరింగ్ కేసు గురించి నటి నవ్యా నాయర్‌కు ముందుగానే తెలిసిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నటి నవ్యా నాయర్ కు ఖరీదైన బంగారు ఆభరణాలను సచిన్ సావంత్ బహుమతిగా ఇచ్చారని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసిందని తెలిసింది. ఈ నేపథ్యంలో నటి నవ్యా నాయర్ మీద కూడా కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెకు నోటీసులు పంపింది.

amous actress

సచిన్ సావంత్, నటి నవ్యా నాయర్ మధ్య సాన్నిహిత్యం ఉందని, సచిన్ నుంచి నటి నవ్యా నాయర్ ఖరీదైన బంగారు ఆభరణాలను బహుమతిగా పొందిందని ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే నటి నవ్యా నాయర్ కారు డ్రైవర్ పోలీసులకు కొన్ని పచ్చి నిజాలు బయటపెట్టాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

నటి నవ్యా నాయర్ కారు డ్రైవర్ సమీర్ గబాజీ నలవాడే ప్రత్యేక కోర్టులో కొంత సమాచారం అందించాడని సంబంధిత అధికారులు అంటున్నారు. నటి నవ్యా నాయర్ తో తనకున్న సన్నిహిత పరిచయాన్ని ఇటీవల సచిన్ సావంత్ నిరాకరించడంతో ఇప్పుడు డ్రైవర్ ఈ సమాచారం ఇచ్చాడు. నటి నవ్యా నాయర్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను ఆమెకు ఎలాంటి విలువైన బహుమతులు ఇవ్వలేదని సచిన్ సావంత్ అంటున్నాడు.

నటి నవ్యా నాయర్ ను కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సచిన్‌ సావంత్ చెప్పాడు. అయితే నటి నవ్యా నాయర్ కారు డ్రైవర్ మరోలా చెబుతున్నాడని అధికారులు అంటున్నారు. తాను సచిన్ గర్ల్ ఫ్రెండ్ అని నవ్యా నాయర్ ప్రకటన చేసినట్లు సమాచారం. అదేంటంటే సచిన్ సావంత్, నటి నవ్యా నాయర్ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు.

నటి నవ్యా నాయర్ కు ఇప్పటికే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంత జరిగినా నవ్యా నాయర్ కు, సచిన్ సావంత్ కు అక్రమ సంబంధం ఉందని, ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందని ఆమె కారు డ్రైవర్ చెబుతున్నాడు. ఇంతకు ముందు నటి నవ్యా నాయర్ ఉన్న భవనంలోనే సచిన్ సావంత్ ఫ్లాట్ కూడా ( ఇల్లు) ఉండేది. నవ్యా నాయర్ కొచ్చికి ఫ్యామిలీని మారిన తర్వాత సచిన్ 15 నుంచి 20 సార్లు కొచ్చికి వచ్చి ఆమెను ఏకాంతంగా కలిశాడని ఆమె కారు డ్రైవర్ అంటున్నారు.

ఆ సందర్బంలో సచిన్ సావంత్ అతని ప్రియురాలు నవ్యా నాయర్ కు దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన నగలు బహుమతిగా ఇచ్చాడని ఆమె కారు డ్రైవర్ సమాచారం ఇచ్చాడని తెలిసింది. కాగా నటి నవ్యా నాయర్ 2010లోనే పెళ్లి చేసుకున్నారు. ముంబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ మీనన్‌తో నటి నవ్యా నాయర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

amous actress

నవ్యా నాయర్ సంతోష్ మీనన్ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత నటి నవ్యా నాయర్ కు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదని, ఆమె ఎక్కువ సినిమాల్లో నటించలేదని ఆమె డ్రైవర్ అంటున్నారు. ఎక్కువగా భరతనాట్యం షోలను ప్రజెంట్ చేస్తున్న నటి నవ్యా నాయర్ ఇప్పటి వరకు పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా పనిచేసిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే ఈ కేసులో నటి నవ్యా నాయర్ ఎలా స్పందిస్తుంది ?. ఈడీ అధికారులకు ఏం చెబుతుంది అనే విషయం వేచి చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+