వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దే..వు..డా కాదు, ఇది చూస్తే దే..వ..తా అంటారు..!

|
Google Oneindia TeluguNews

రాజకీయాలైనా.. సినిమాలైనా.. అభిమానించడంలో తమిళ జనం తర్వాతే ఎవరైనా..! నచ్చితే నెత్తినెక్కించుకోవడం కాదు. చెవికెక్కించుకోవడం కూడా వారికే చెల్లుబాటయ్యే విషయం. చెవికెక్కించుకోవడమంటే నేతల మాటలను పాటించడమని కాదు. ఇంతవరకు ఎవరికి తట్టని రీతిలో తమ నేత జయలలిత ముఖచిత్రంతో కూడిన చెవి దుద్దులను ధరించి ఎన్నికల ప్రచారానికి మరింత పబ్లిసిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అమ్మ ఫ్యాన్స్.

తమిళనాడులో ఎన్నికల వేళ.. తమిళ జనం అమ్మగా ఆరాధించే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై వినూత్న రీతిలో అమ్మ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా జయలలిత ముఖచిత్రాన్ని ముద్రించిన చెవి దిద్దులను ధరించి అందరి నోటా హాట్ టాపిక్ అయ్యారు. కాగా.. ఇది కాస్తా సోషల్ మీడియాలోకి ఎక్కడంతో అమ్మా ఫ్యాన్సా..! మజాకా..! అనుకుంటున్నారు నెటిజన్లు.

its an intresting buzz in tamilanadu elections. amma fans

జయలలిత చిత్రంతో పాటు అన్నాడీఎంకే పార్టీ గుర్తైన రెండాకుల బొమ్మను కూడా తన చెవికి ధరించింది ఓ అమ్మ అభిమాని. సోషల్ మీడియాలో ఇప్పుడిదో వైరల్. మొత్తానికి అమ్మ ఫ్యాన్స్ అమ్మను ఇలా చెవికెక్కించేసుకున్నారు.

English summary
its an intresting buzz in tamilanadu elections. amma fans
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X