శశికళ మీద పోటీ చేస్తా: జయలలిత మేనకోడలు దీపా చాలెంజ్
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్దం అయిన నేపథ్యంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పెద్ద షాక్ ఇచ్చారు. శశికళ ఎలా సీఎం అవుతారో చూస్తా అంటూ పరోక్షంగా హెచ్చరించారు.
శశికళ ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని జయలలిత మేన కోడలు తేల్చి చెప్పారు. మా మేనత్తకు మా కుటుంబాన్ని దూరం చేసిన వారు ఎవ్వరూ బాగుపడరని దీపా జయకుమార్ శశికళ, ఆమె కుటుంబ సభ్యుల మీద మండిపడ్డారు.
జయలలిత ప్రాతినిథ్య వహించిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అని మీడియా దీపాను ప్రశ్నిస్తే తాను శశికళ పోటీ చేసే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని ఆమె సమాధానం ఇచ్చారు.

మొత్తం మీద దీపా జయకుమార్ తన మేనత్తను దూరం చేసిన శశికళ మీద రాజకీయంగానే కక్ష తీర్చుకుంటానని పరోక్షంగా హెచ్చరించారు. దీపా జయకుమార్ కు ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు వస్తున్నది.
ఈ సమయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ శశికళ పోటీ చేసే నియోజక వర్గం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో చిన్నమ్మ అనుచరులు షాక్ కు గురైనారు. అధికారంలో ఉన్న తామే ఎలాగైనా శశికళను గెలిపించుకుంటామని చిన్నమ్మ అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications