రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా
అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జయలలిత మేనకోడలు దీపా మాట్లాడుతూ తన రాజకీయ పయనాన్ని ఎవరూ అడ్డుకోలేరని, నన్ను ఏ శక్తులు అడ్డుకోలేవని దీపా గట్టిగా చెప్పారు.
చెన్నై: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని జయలలిత మేనకోడలు దీపా మీద రోజురోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది. చెన్నైలోని టీ నగర్ లో ఉన్న ఆమె ఇంటికి ప్రతి రోజు వేలాది మంది అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు వెలుతున్నారు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మనవి చేస్తున్నారు.
అన్నాడీఎంకే మహిళా కార్యకర్తలు దీపా జయకుమార్ చేతులు పట్టుకుని బతిమాలతున్నారు. జయలలిత ఆసుపత్రి పాలయ్యే వరకు దీపా అంటే చాలమందికి తెలీదు. మా అత్తను చూపించండి అంటు దీపా అపోలో ఆసుపత్రి దగ్గర పడిగాపులు కాసినపుడే ఆమె ఎవరో అనే విషయం బాహ్య ప్రంపంచానికి తెలిసింది.
జయలలిత భౌతికకాయాన్ని సందర్శించడానికి వెళ్లిన దీపను శశికళ వర్గీయులు అడ్డుకోవడంతో ఎంతో కష్టం మీద దీపా మేనత్తకు నివాళులు అర్పించారు. తరువాత మా మేనత్తకు నివాళులు అర్పించడానికి వెళ్లిన తనను అడ్డుకోవడానికి శశికళ, ఆమె బంధువులు ఎవరు ? అని దీపా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

జయ వారసురాలు
జయలలిత రాజకీయ వారసలు ఎవరు, ఆమె ఆస్తి ఎవరికి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు ? అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు శశికళ పేరుతో పాటు దీపా పేరు మార్మోగిపోయింది. దేశం మొత్తం దీపా గురించి చర్చించుకున్నారు.

చక్రం తిప్పిన శశికళ
నెచ్చెలి శశికళ చక్రం తిప్పి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. అయితే శశికళ ప్రజలకు, అన్నాడీఎంకే కార్యకర్తలకు మాత్రం దగ్గర కాలేకపోయారు. జయలలిత నిజమైన వారసురాలు దీపానే అని అన్నాడీఎంకే కార్యకర్తలు బహిరంగంగా చెబుతున్నారు.

దీపా పేరవై, అమ్మా డీఎంకే పార్టీ
ఇప్పుడు దీపా పేరుతో దీపా పేరవై అనే సంస్థను, అమ్మ అన్నాడీఎంకే పార్టీ అనే పార్టీని స్థాపించిన జయలలిత అభిమానులు ప్రతి రోజు దీపా ఇంటి దగ్గరకు వెళ్లి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మనవి చేస్తున్నారు. దీపాను చూడటానికి పోటీ పడుతున్నారు.

నన్ను ఏ శక్తులు అడ్డుకోలేవు
ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి దీపా మాట్లాడుతూ తన రాజకీయ పయనాన్ని ఎవరూ అడ్డుకోలేరని, నన్ను ఏ శక్తులు అడ్డుకోలేవని దీపా గట్టిగా చెప్పారు. జయలలిత పేరు, ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దీపా చెప్పడంతో కార్యకర్తలు ఆనందంతో చప్పట్లు కొట్టారు.

ఆర్ కే నగర్ నియోజక వర్గం
ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారా అని కార్యకర్తలు దీపాను అడిగారు. అమ్మ ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని, వారితో సమావేశం అయిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామని దీపా ప్రకటించారు.

మీకు అండగాఉంటాం దీపా మేడమ్
మీకు అండగా మేము ఉంటామని, ఎంతవరకైనా తాము మీవెంటే ఉంటామని ఆర్ కే నగర్ నుంచి వచ్చిన అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు దీపాకు హామి ఇచ్చారు. మీరు ఒక్క సారి మా నియోజక వర్గానికి వచ్చి అక్కడి ప్రజలతో మాట్లాడాలని మనవి చేస్తున్నారు.

అమ్మ లాగే నడుచుకుంటున్న దీపా
తన ఇంటి దగ్గరకు వచ్చిన జయలలిత అభిమానులకు దీపా ఎంతో ఓపిగ్గా మాట్లాడుతూ నచ్చజెప్పి పంపిస్తున్నారు. దీపా ఇంట్లో లేని సమయంలో ఆమె భర్త మాదవన్ కార్యకర్తలను కలుస్తున్నారు. ఇలా దీపా మీద రోజురోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది.

మాకు అభ్యంతరం లేదు
దీపా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లడానికి తామకు ఎలాంటి అభ్యంతరం లేదని, మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె భర్త మాదవన్ మీడియాకు చెప్పారు. మీరు ఇలాగే మద్దతు ఇస్తే అమ్మ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడానికి మేము దీపాను గెలిపించుకుంటామని కార్యకర్తలు శపథం చేశారు.












Click it and Unblock the Notifications