జయ దత్త పుత్రుడిపై గంజాయి కేసు: అడుగు పెట్టాడు అంతే

నెచ్చెలి శశికళ అన్న కుమారుడు సుధాకరన్ ను 1995 సెప్టెంబర్ లో జయలలిత దత్తత తీసుకున్నారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత దత్త పుత్రుడు సుధాకరన్ అడ్రస్ లేకపోవడం ఇప్పడు పెద్ద చర్చకు దారితీసింది. ఎంతో ప్రేమగా దత్తత తీసుకుని, అతని వివాహం రంగరంగ వైభవంగా చేసిన జయలలితకు అప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి.

నెచ్చెలి శశికళ అన్న కుమారుడు సుధాకరన్ ను 1995 సెప్టెంబర్ లో జయలలిత దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి జయలలిత జీవితంలో ఊహించని మలుపులు తిరిగాయి. ఆమె జైలుకు వెళ్లవలసి వచ్చింది.

సుధాకరన్ ను దత్తత తీసుకున్న తరువాత అతని ఆలనాపాలనా అంతా జయలలిత దగ్గర ఉండి చూసుకున్నారు. అలనాటి తమిళ ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ మనవరాలు సత్యవతితో 1996లో జయలలిత తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం అత్యంత ఆడంబరంగా చేశారు.

అప్పుడే జయలలితకు కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఈ పెళ్లి జయ ప్రభుత్వాన్ని కుదిపేసింది. కేసులు నమోదు అయ్యాయి. జయలలితతో పాటు శశికళ జైలుకు వెళ్లారు. అయితే జయలలిత అన్నీ కూల్ గా తీసుకున్నారు.

J Jayalalithaa once considered Sudhakran her foster son (1995)

జైలు నుంచి బయటకు వచ్చిన జయలలిత ఎప్పటిలాగే సుధాకరన్ ను ప్రేమగా చూసుకున్నారు. అయితే అతను ఆ విలువను కాపాడులేకపోయాడు. సుధాకరన్ మీద గంజాయి కేసు పడటంతో జయ కుంగిపోయారు. ఎంజీఆర్ చనిపోయిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలు, కష్టాలను సైతం జయలలిత తట్టుకున్నారు.

అయితే సుధాకరన్ మీద గంజాయి కేసు పడటంతో ఆమె షాక్ కు గురైనారు. అంతే దత్తపుత్రుడు సుధాకరన్ ని దూరం పెట్టారు. చివరికి జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా సుధాకరన్ కనపడలేదు. ఇప్పుడు జయ ఆస్తికి తానే వారసుడు అని వస్తాడా ? అత్త శశికళను ఎదరించే ధైర్యం సుధాకరన్ కు ఉందా? అనే విషయంపై చర్చ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+