లష్కరే తొయిబాలో కొత్త విభాగం: ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన జవాన్లు

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్ల మధ్య భీకర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ తెల్లవారు జాము వరకూ ఎదురు కాల్పులు కొనసాగాయి. షోపియాన్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఎదురు కాల్పుల్లో జవాన్లు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సోమవారం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లోో అయిదుమంది జవాన్లు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంది సైన్యం. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

సోమవారం తెల్లవారు జామున రాజౌరి సెక్టార్‌లో సంభవించిన ఎన్‌కౌంటర్‌లో అయిదుమంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖను దాటుకుని అక్రమంగా భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులపై సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో మన్‌దీప్ సింగ్, వైశాఖ్ హెచ్, జస్వీందర్ సింగ్, సరజ్ సింగ్, గజ్జన్ సింగ్ వీరమరణం పొందారు.

J&K encounter: Three Lashkar Terrorists Killed in Shopian

ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు రాజౌరి సెక్టార్ మీదుగా అక్రమంగా కాశ్మీర్‌లోకి చొరబడినట్లు గుర్తించడంతో వారి కోసం వేట మొదలు పెట్టారు జవాన్లు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. షోపియాన్‌ శివార్లల్లో ఓ భవనంలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందింది. పెద్ద ఎత్తున జవాన్లు అక్కడికి చేరుకున్నారు. లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. సైన్యం హెచ్చరికలను టెర్రరిస్టులు పట్టించుకోలేదు. కాల్పులకు దిగారు. దీనితో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.

కొన్ని గంటల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరిని ముఖ్తార్ షా గా గుర్తించారు. గండెర్‌బల్ నివాసిగా గుర్తించారు. బిహార్‌లో అతని మీద పలు కేసులు నమోదై ఉన్నట్లు కాశ్మీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఓ చిరు వ్యాపారిని హత్య చేశాడని చెప్పారు. అతని కోసం బిహార్ పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. హత్యనేరం నమోదైన తరువాత అతను బిహార్ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వచ్చాడని చెప్పారు.

లష్కరే తొయిబాలో కొత్తగా ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే విభాగం ఏర్పాటైందని, ఇప్పుడు హతమైన ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఈ విభాగానికి చెందినవారేనని పేర్కొన్నారు. ఈ రెసిస్టెన్స్ ఫోర్స్‌లో ఎంతమంది ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నామని, ముగ్గురు ఉగ్రవాదుల కార్యకలాపాలు, వారికి ఉన్న ఇతర సంబంధాలపై దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఈ రెసిస్టెన్స్ ఫోర్స్‌లో మరింత మంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు విజయ్ కుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+