ఖైదీ మూత్రనాళంలో పెన్సిల్.. అక్కడ ఎలా పెట్టావ్ రా బాబు..!
ఛత్తీస్ గఢ్ లోని అంబికాపుర్ సెంట్రల్ జైలులో షాకింగ్ ఘటన జరిగింది. ఖైదీ మూత్రనాళంలో 9 సెంటీమీటర్ల పెన్సిల్ ఇరుక్కుపోయింది. ఆ పెన్సిల్ ను వైద్యులు దాదాపు 4 గంటలపాటు ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో ఖైదీ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఖైదీ మూత్ర విసర్జనలో ఆటంకం, తీవ్ర రక్తస్రావం జరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ ప్రారంభించారు.
ఖైదీ మూత్రనాళంలో పెన్సిల్ ఇరుక్కుపోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అంబికాపుర్ సెంట్రల్ జైలులోని ఖైదీ అనారోగ్యానికి గురికావడంతో.. అతడ్ని ఆసుపత్రి జైలు వార్డులో చేర్చారు. అయితే ఖైదీ మూత్ర నాళం వాపు, రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించి. వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని మూత్ర నాళంలో పెన్సిల్ ఇరుక్కుపోయి ఉందని గుర్తించారు. దాదాపు 4 గంటలపాటు ఐదుగురు వైద్యుల బృందం ఆపరేషన్ చేసి పెన్సిల్ ను తొలగించారు. తమ సర్వీస్ లో ఇలాంటి కేసు చూడలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. వైద్య బృందం పర్యవేక్షణలో ఖైదీ ఉన్నాడని పేర్కొన్నారు.

తన మూత్ర నాళంలో మంట, దురదగా ఉందని మూత్ర నాళంలో పెన్సిల్ పెట్టినట్లు ఖైదీ చెప్పాడని వైద్యులు చెబుతున్నారు. అప్పుడు పెన్సిల్ ప్రైవేట్ పార్ట్ లో ఇరుక్కుపోయి తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపాడని వివరించారు. శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే జైలులో ఖైదీ వద్ద పెన్సిల్ ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదైనా నేరం చేయడానికి ఈ పెన్సిల్ ను ఉపయోగిస్తే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications