Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్ వీడియో: ఫ్రెంచ్ భాషలో ఇరగొట్టిన ఆటోవాలా..!

సోషల్ మీడియా వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే వైరల్ వీడియోలు, వార్తలు, సంఘటనలు క్షణాల్లో మన ముందుకు వస్తున్నాయి. వీటిల్లో అనేక ఘటనలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దేశంలోని ఎంతోమంది సాధారణ ప్రజల ప్రతిభను సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. మట్టిలో మాణిక్యాలు అన్నట్లుగా ఎంతో టాలెంట్ ఉన్నా ఆదరణకు నోచుకోని వారికి సామాజిక మాధ్యమాలు ఓ వేదికగా నిలుస్తున్నాయి. ఇలాంటి విశేషాలు రోజుకు వేలల్లో మనకు కనిపిస్తున్నాయి. అలాంటి వీడియోనే తాజాగా ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రాజస్థాన్ జైపుర్ కు చెందిన ఓ ఆటో డ్రైవర్ టాలెంట్ చూస్తే ఎవరైనా ఫిదా అవుతారు. అయితే ఈ డ్రైవరన్న టాలెంట్ డ్రైవింగ్ లో కాదు.. ఫ్రెంచ్ భాషలో.. గలగలా అనర్గళంగా ఫ్రెంచ్ భాషను మాట్లాడుతున్న ఈ ఆటో డ్రైవర్ వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. సాధారణంగా భారతీయ భాషలను నేర్చుకోవడానికి మనం నానా తంటాలు పడుతుంటే ఓ ఆటో డ్రైవర్ మాత్రం అనర్గళంగా ఫ్రెంచ్ భాషలో ఇరగదీస్తున్న క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా అతడ్ని ప్రశంసిస్తున్నారు. వావ్.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

జైపుర్ పింక్ సిటీగా పేరుగాంచింది. ఈ నగరాన్ని చూసేందుకు నిత్యం వందలాది మంది టూరిస్టులు వస్తుంటారు. విదేశాల నుంచి కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన ప్రాంతంగా పేరుగాంచిన జైపుర్ ను సందర్శిస్తుంటారు. అయితే తాజాగా ఫ్రెంచ్ టూరిస్ట్ బెనాయిట్ జైపుర్ సందర్శించాడు. జైపుర్ లో ఆటోలో ప్రయాణిస్తుండగా.. ఓ ఆటో డ్రైవర్ స్పష్టంగా ఫ్రెంచ్ భాష మాట్లాడటం గమనించాడు. నేను టూరిస్టులతో ఫ్రెంచ్ భాషలో మాట్లాడతానని ఆటోవాలా బెనాయిట్ తో ఫ్రెంచ్ లో చెప్పాడు. దీంతో బెనాయిట్ షాక్ అయ్యాడు. నా కన్నా నువ్వే బాగా ఫ్రెంచ్ మాట్లాడుతున్నావంటూ కితాబు ఇచ్చాడు.

Jaipur Auto Driver Stuns with Fluent French Viral Video Shocks Social Media

అప్పుడు ఆ ఆటో డ్రైవర్.. ఇది లైఫ్.. యూ వాంట్ సమ్ థింగ్.. ఐ వాంట్ సమ్ థింగ్.. దిస్ ఈజ్ లైఫ్.
అండ్.. యూ డోంట్ నో మీ.. ఐ డోంట్ నో యూ అంటూ చెప్పుకొచ్చాడు.. అతడి మాటలు విన్న బెనాయిట్.. అన్ బిలీవబుల్ అంటూ ప్రశంసించాడు. తాను టూరిస్టులను ఆటోలో తిప్పుతూ ఫ్రెంచ్ నేర్చుకున్నట్లు తెలిపాడు ఆటో డ్రైవర్.. తాజాగా ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు బెనాయిట్. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+