మరణించివారు పెళ్లికి ఆహ్వానిస్తే.. వెరైటీ వెడ్డింగ్ కార్డు..మీరూ చూడండి..
సాధారణంగా ఏ పెళ్లికైనా బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు ఆహ్వానిస్తారు. కానీ ఓ వరుడి పెళ్లికి చనిపోయిన వాళ్లు ఆహ్వానిస్తే.. ట్విస్ట్ అదుర్స్ కదూ.. అవును తమ కుటుంబంలోని వివాహానికి రావాలంటూ మరణించిన వ్యక్తులు.. బంధువులందరినీ అహ్వానించారు. ఆహ్వానితుల జాబితాలో చనిపోయిన వ్యక్తుల పేర్లను కూడా చేర్చాడు ఆ వరుడు. అంటే మనల్ని పెళ్లికి మరణించిన వ్యక్తులు కూడా ఆహ్వానిస్తున్నారని అర్థం. అందుకు సంబంధించిన పెళ్లి శుభలేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ముస్లీం కుటుంబం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఈ వెడ్డింగ్ కార్డును ఫయిక్ అతిక్ కిడ్వాయి అనే ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వివాహం జైపుర్ లో ఫిబ్రవరి 9 న జరిగింది. అయితే ఈ వెడ్డింగ్ కార్డు చూడటానికి సాధారణ కార్డులాగే ఉన్నా అందులో రాసిన అక్షరాలు మాత్రం వింతగా ఉన్నాయి.

ఆహ్వానితుల జాబితాలో చనిపోయిన కుటుంబసభ్యులు, బంధువుల పేర్లు కూడా ఉన్నాయి. లేట్ నూరుల్ హేక్,లేట్ లాలూ హేక్, లేట్ బాబు హేక్, లేట్ ఇజాజ్ హేక్ మిమ్మల్ని పెళ్లికి ఇన్ వైట్ చేస్తున్నారు అని చనిపోయినవాళ్ల పేర్లు అందులో రాసి ఉంది. దీంతో ఈ కార్డు అందుకున్నవాళ్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తెలియక అలా ప్రింట్ చేసారా లేక కావాలనే వారి పేర్లను ప్రింట్ చేశారా? అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఈ వెడ్డింగ్ కార్డు వైరల్ అయింది.

ఈ పోస్ట్ పై స్పందించిన నెటిజన్లు.. జోధ్ పుర్, జైపుర్ నగరాల్లో ఇలాంటి వెడ్డింగ్ కార్డ్స్ సహజం అని కామెంట్ చేస్తున్నారు. తాము కూడా అలాంటి కార్డ్స్ ను ప్రింట్ చేసామని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications