ఇరాన్ యుద్ధం: 67,000 మంది భారతీయులు స్వదేశానికి..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడులకు ధీటుగా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్స్ ను ఇజ్రాయెల్, అలాగే అమెరికా స్థావరాలపైకి ప్రయోగిస్తోంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంపై భారత్ విధానం ఏంటన్నదానిపై మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై తమకు ఆందోళన ఉందని అన్నారు. భారత్ సరిహద్దు దేశం కాబట్టి పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
"దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అలాగే ఇరాన్ లోనూ వేల మంది భారతీయులు విద్య, ఉపాధి పొందుతున్నారు. ఆ ప్రాంతం భారత్ ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సరఫరాకు కీలకంగా ఉంది. వీటి సరఫరాపై నెలకొన్న సందిగ్ధత, వాతావరణ ప్రతికూల పరిస్థితులు కచ్చితంగా సీరియస్ సమస్యలు" అని జై శంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ లోని చమురు నిల్వలు, సరఫరా, కొరతపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
అలాగే యుద్ధం కారణంగా భారత ప్రాదేశిక జలాల్లో ఒడిదుడుకులు నెలకున్నాయని వీటి కారణంగా భారత్ కు చెందిన ఇద్దరు నావికులను కోల్పోయామని.. మరొకరు మిస్సింగ్ అయినట్లు జై శంకర్ స్పష్టం చేశారు. అంతేకాక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దౌత్యం, చర్చల వల్లే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని పేర్కొన్నారు. భారత్ ప్రభుత్వం గత నెల నుంచి ఇదే విషయాన్ని చెబుతూ వస్తోందని జై శంకర్ తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధం తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అలాగే సంబంధిత మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ.. UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ స్వయంగా మాట్లాడి అక్కడి భారతీయుల భద్రత గురించి చర్చించారని తెలిపారు. అలాగే భారత్ ఇప్పటివరకూ దాదాపు 67 వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి తరలించిందని జై శంకర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications