జయలలిత కొత్త స్కీం 'అమ్మ బేబీ', 16 వస్తువుల కిట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాష్ట్రంలో మరో పథకం ప్రారంభించారు. అమ్మ బేబీ కేర్ కిట్ పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ చౌక వస్తు సరఫరా, అమ్మ నూనె, అమ్మ మంచినీరు, అమ్మ మందుల షాపు, అమ్మ ఉప్పు, అమ్మ విత్తనాలు తదితరాలు ఉన్నాయి.
తాజాగా పుట్టిన పిల్లల కోసం కొత్త పథకం ప్రారంభించారు. అమ్మ బేబే కేర్ కిట్ పేరిట నవజాత శిశువులకు అవసరమయ్యే వెయ్యి రూపాయల విలువ చేసే 16 వస్తువులను సరఫరా చేస్తారు. ఈ పథకం ద్వారా తమిళనాట 7 లక్షల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.

అమ్మ బేబీ కేర్ కిట్ పథకానికి ఏటా 67 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. ఇందులో టవల్, బేబే డ్రెస్, బేబీ బెడ్, ప్రొటెక్షన్ నెట్, న్యాప్ కిన్, బేబే ఆయిల్, సాంపూ సాచెట్, సోప్ బాక్స్, నెయిల్ క్లిప్పర్, టాయ్, ఓ గిలక్కాయతో పాటు తల్లికి లిక్విడ్ హ్యాండ్ వాష్ సోప్ ఉంటుంది.












Click it and Unblock the Notifications