• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేను మహారాణిగా బతికేస్తా: జయ లేఖ ఇలా

|

చెన్నై: రాజకీయాల్లోకి రాక ముందు నుంచి జయలలిత ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, విమర్శలను సైతం ఆమె చిరునవ్వుతో స్వీకరించేవారు. పోగొట్టుకున్న చోట దాన్ని రాబట్టుకోవాలని పరితపించే తత్వం జయలలితది.

జయలలిత సినీరంగంలోకి వచ్చినప్పుడు పోరాటం, రాజకీయ రంగంలో పోరాటం, ప్రజల కోసం పోరాటం, చివరికి మృత్యువుతో సహ 75 రోజు పాటు పోరాటం. జయలలిత జీవితం మొత్తం పోరాటం... పోరాటం....

అందుకే ఆమె తమిళనాడు ప్రజలకు అమ్మ అయ్యారు. చివరికి ప్రతిపక్షాలు సైతం జయలలితకు జోహార్ అంటున్నారు. జయలలిత చరిష్మా ఎలా ఉంటుందో చెప్పడానికి గతంలో జరిగిన ఈ ఒక్క ఉదాహరణ చాలు.

1980 మే 25వ తేదిన ఖాస్ బాత్ అనే మేగజిన్ ఎడిటర్ పియోస్ జీకి జయలలితను విమర్శిస్తూ ఓ కథనం ప్రచురించారు. జయలలిత పని ఇక అయిపోయిందని, ఆమె ఇక సినిమాల్లోకి రావడానికి అవకాశం లేదని, చిత్రపరిశ్రమలో ఆమె యుగం ముగిసిపోయిందంటూ విమర్శిస్తూ కథనం ప్రచురించారు.

Jayalalithaa: Rajaji Hall for the public to pay their last respects.

జయలలిత ఇక మీద తెరమీద కనపడే అవకాశం ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పింది. అదే ఏడాది జూన్ 10వ తేది జయలలిత స్వయంగా ఆ మేగజిన్ కు లేఖ రాశారు. ఆలేఖ చూసిన ఆ మేగజిన్ నిర్వహకులు షాక్ కు గురైనారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇది...

"ప్రియమైన ప్రియోస్ జీకి, మీ ఖాస్ బాత్ సంచికలో గత మే 25వ తేదిన నాపై ఎన్నో ప్రశంసలు కురిపించారు. అందుకు మీకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నా గురించి మీకు ఇలాంటి సమాచారం ఇచ్చింది ఎవరో మాత్రం నాకు తెలీదు.

నేను సినిమాల్లో నటించడానికి చాలకష్టపడుతున్నానని రాశారు. ఆ విషయం మీకు ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది ? అనే విషయం నాకు తెలీదు. నా మీద మీకు ఇలాంటి అభిప్రాయం ఎలా వచ్చిందో నాకు మాత్రం అర్థం కావడం లేదు.

వాస్తవానికి నేను చాలచాల గొప్పగొప్ప అవకాశాలు వదిలేశాను. అది ఎందుకు వదిలేశాను అనే విషయం నాకు తెలుసు. ప్రముఖ నిర్మాత బాలాజీ నన్ను హీరోయిన్ గా పెట్టి బిల్లా సినిమా తీస్తానని నన్ను సంప్రదించారు.

ఆ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అనే విషయం మీకు తెలుసు. అయితే తాను తిరస్కరించడంతో నాస్థానంలో శ్రీ ప్రియను తీసుకుని సినిమా తీశారని గుర్తు చేశారు. ఈ విషయం నిర్మాత బాలాజీ గారు చాలసార్లు చెప్పారు అనే విషయం మీకు తెలుసు.

నిజంగా నాకు సినిమాల్లో చేయాల్సిన అవసరం లేదు. నాకు సినిమా జీవితంపై పెద్ద ఆసక్తికూడా లేదు. దేవుడి దయవలన ఆర్థికంగా స్థిరపడ్డాను. నిజంగా మీరు చెప్పినట్లే నాకు సినిమాల్లో అవకాశాలు రాకపోతే మహారాణి లాగా దర్జాగా బతికేస్తాను"

జయలలిత రాసిన లేఖ రాయడంతో ఆ మేగజిన్ నిర్వహకులు షాక్ కు గురైనారు. ఎక్కడా ఆమె లేఖలో పరుష పదజాలం గానీ, ఆగ్రహం గానీ కనిపించకపోవడం విశేషం.

English summary
Jayalalithaa’s body was brought to her residence, Poes Garden, past midnight and will be kept at Rajaji Hall for the public to pay their last respects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X