వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు.. ఆ విషయంలో జయతో గొడవపడ్డాను!

2002లో చివరిసారి తాను మేనత్త జయలలితను కలిసినప్పుడు తమ కుటుంబాన్ని ఎందుకు దూరం పెట్టావని ఆమెతో గొడవపడ్డట్టుగా దీప తెలిపారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మరణానంతరం ఎక్కువగా వార్తల్లో నానుతున్న పేరు దీప. జయకు మేనకోడలు కావడం.. జయ లాంటి పోలికలతోనే ఉండటంతో.. సహజంగానే ఆమెపై మీడియా ఫోకస్ కూడా ఎక్కువైంది.

ఈ క్రమంలోనే జయకు నిజమైన వారసురాలిని తానే అంటూ దీప ప్రకటించడం.. జె అన్నాడీఎంకె పేరిట తమిళనాట కొత్త పార్టీ వస్తుందని, దానికి దీప అధ్యక్షురాలిగా ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవన్నీ ఇలా ఉంటే.. జయలలితతో తన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. మేనత్తతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొస్తున్నారు దీప. తాజాగా తన చిన్నతనం నుంచి అమ్మ చనిపోయే ముందు దాకా.. జయతో తనకున్న అనుబంధం గురించి దీప వివరించారు.

ఆ పేరు పెట్టింది జయలలితే:

ఆ పేరు పెట్టింది జయలలితే:

తాను 1974లో దీపావళికి ఒకరోజు ముందు జన్మించినట్టుగా దీప చెప్పారు. ఆ సమయంలో జయలలిత తమ కుటుంబంతోనే ఉన్నారని, తనకు 'దీప' అని నామకరణం చేసింది ఆమె అని దీప తెలిపారు. దీప అంటే వెలుతురు అని చెప్పుకొచ్చారు. కాగా, దీప తండ్రి జయకుమార్ జయలలితకు స్వయాన సోదరుడు అన్న సంగతి తెలిసిందే.

మేనత్త జయనే రోల్ మోడల్:

మేనత్త జయనే రోల్ మోడల్:

తాను స్కూల్ కి వెళ్లే రోజుల్లో.. మేనత్త జయలలిత సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని, ఆమె తనకు ఓ రోల్ మోడల్ లా అనిపించేవారని దీప చెప్పారు. కష్టపడటం, నిస్వార్థం, అంకితభావం వంటి జయలలితలో ఉన్న సద్గుణాలు తననెంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.

జీవితంలో గుర్తుండిపోయే క్షణాలు:

జీవితంలో గుర్తుండిపోయే క్షణాలు:

పోయెస్ గార్డెన్ నుంచి తమ కుటుంబం బయటికొచ్చేశాక.. అక్కడికి కొత్తవాళ్లు వచ్చి చేరారని దీప పేర్కొన్నారు. తిరిగి 1991లో జయ తొలిసారి సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు తమ కుటుంబం జయతో కలిసి లంచ్ చేసిందని, ఆ సమయంలో నాన్న తనను మేనత్తకు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తన వయసు 16ఏళ్లు అని తెలిపారు.

ఆ క్షణాలను తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని దీప సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చాలాసార్లు మేనత్త జయలలితను తాను కలిశానని, ముఖ్యమైన కార్యక్రమాలన్నింటికీ తమ కుటుంబానికి జయ ఆహ్వానం పంపించేవారని పేర్కొన్నారు.

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా!:

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా!:

రోజులెప్పుడూ ఒకేలా ఉండవని చెప్పుకొచ్చిన దీప.. నాన్న చనిపోయిన తర్వాత మేనత్త జయలలిత వచ్చి తమను ఓదార్చారని తెలిపారు. నాన్నతో కలిసి తను స్కూల్ కి వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత జయతో తమ కుటుంబానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మేనత్తను కలిసే క్రమంలో అవమానాలు:

మేనత్తను కలిసే క్రమంలో అవమానాలు:

1997లో జయలలిత జైలు జీవితం గడిపినప్పుడు అక్కడకు వెళ్లి కలిశానని దీప చెప్పారు. అయితే నువ్వు చిన్నపిల్లవి గనుక ఇక్కడికి రావద్దని దీప సున్నితంగా హెచ్చరించారట జయ. ఆ తర్వాతి రోజుల్లో చాలాసార్లు పోయెస్ గార్డెన్ లో జయలలితను కలవడానికి ప్రయత్నించానని, ఆ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా తనను బయటకు నెట్టివేసిన అవమానకర ఘటనలు ఎదుర్కొన్నానని వాపోయారు.

2002లో చివరిసారి కలిసినప్పుడు గొడవ:

2002లో చివరిసారి కలిసినప్పుడు గొడవ:

2002లో చివరిసారి తాను మేనత్త జయలలితను కలిసినట్టుగా దీప వెల్లడించారు. ఆ సమయంలోనే తమ కుటుంబాన్ని ఎందుకు దూరం పెట్టావంటూ ఆమెతో వాగ్వాదానికి దిగానని తెలిపారు. ఆరోజు జయలలితతో ఐదారు గంటలు గడిపానని, అయితే అప్పటికే చాలా మీటింగ్స్ కు హాజరుకావాల్సి ఉండటంతో మేనత్త జయలలిత తర్వాత కలుద్దామని చెప్పినట్టుగా తెలియజేశారు. ఆ తర్వాత జయలలితతో తమ కుటుంబం ఇంకెప్పుడూ కలవలేదని గుర్తుచేసుకున్నారు.

English summary
It was a day before Diwali in 1974 that I was born and Jayalalithaa Jayaram was one of the happiest souls, standing next to my parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X