బార్ గర్ల్‌తో జెడియు నేత డ్యాన్స్, ప్రియుడ్ని చంపించిన ప్రియురాలు!
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో... బీహార్‌లో జేడీయూ నేత అభయ్ కుష్వాహ బార్ డ్యాన్స్ గర్ల్‌తో పోల్ డ్యాన్స్ చేశారు. ఆ గర్ల్‌తో చిందులేస్తూ ఆమె పైకి కరెన్సీ నోట్లు విసిరేశారు. సుమారు నిమిషం పైన అతను సరదాగా చిందులేశారు.
సదరు జేడీయూ నేత అభయ్ కుష్వాహ... గయ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బార్ గర్ల్‌తో డ్యాన్స్ చేస్తూ, ఆమె పైకి నోట్లను విసరడంపై రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇది వివాదం అవుతోంది.

ప్రియుడిని చంపించిన ప్రియురాలు!
ముంబైలోని బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో దారుణం వెలుగు చూసింది. 21 ఏళ్ల యువతి... ఇరవై రెండేళ్ల ఏళ్ల రిజ్వాన్ అనే యువకుడిని కొంత కాలంగా ప్రేమిస్తుంది. సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో నిన్ను కలవాలని ఉందని రిజ్వాన్‌కు ప్రేయసి ఫోన్ చేసింది.
ఆ సమయంలో రిజ్వాన్ తన స్నేహితులతో కలిసి ఖార్‌లోని ఓ పబ్‌లో ఉన్నాడు. ఇక తన ప్రేయసి పిలుస్తుందని చెప్పి కార్టర్ రోడ్‌కు బయల్దేరాడు. రిజ్వాన్‌తో పాటు తన స్నేహితులు వచ్చారు. వారు ఓ పక్కన ఉన్నారు. అప్పటికే కార్టర్ రోడ్‌లో ఉన్న ప్రేయసి... రిజ్వాన్ వచ్చాక గొడవకు దిగింది.
చిన్న గొడవే పెద్దదైంది. వీరి పక్కన మరో ఐదుగురు వ్యక్తులున్నారు. రిజ్వాన్ స్నేహితులు అతనికి దూరంగానే ఉన్నారు. ఎంత సేపటికి రిజ్వాన్ రాకపోవడంతో అతని స్నేహితులు అక్కడికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
అంతకు ముందు కనిపించిన ఐదుగురు వ్యక్తులే రిజ్వాన్ చంపి బైక్‌లపై పారిపోతుంటే చూశానని స్నేహితుడు సేఫ్ మీర్జా చెప్పారు. రిజ్వాన్‌ను ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేదు. అప్పటికే రిజ్వాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలిలో ఒక ఆయుధం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు












Click it and Unblock the Notifications