JEE Main 2023 results: ఫలితాలు వచ్చేశాయ్: డైరెక్ట్ లింక్ ఇదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్ 2 (JEE Main results) ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్దిసేపటి కిందటే వీటిని విడుదల చేసింది. ఈ ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో పొందుపరిచింది. జేఈఈ మెయిన్, ఎన్టీఏ రిజల్ట్స్ అనే వెబ్‌సైట్లలో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
జేఈఈ టాపర్స్ లిస్ట్‌ను కొద్దిసేపటి తరువాత ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. ఈ లింక్ jeemain.nta.nic.in, ntaresults.nic.in. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌తో పాటు అగ్రిగేట్ పర్సెంటైల్ మార్కుల స్కోరింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ఈ వెబ్‌సైట్స్‌లల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు.. ఈ లింక్స్‌ను క్లిక్ చేయడం ద్వారా వాటిని తెలుసుకోవచ్చు.

ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), గవర్నమెంట్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్స్‌లల్లో ప్రవేశాలు పొందుతారు. జేఈఈ మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశ అర్హత లభిస్తుంది. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతంగా నిర్ధారించారు.
విద్యార్థులు తొలుత వెబ్‌సైట్స్ లింక్స్‌ను క్లిక్ చేయాలి. లాగిన్ కావడం కోసం తమ అప్లికేషన్ నంబర్‌ను పొందుపరచాలి. అది ఓపెన్ కావడానికి పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. పాస్‌వర్డ్ అందుబాటులో లేకపోతే పుట్టిన రోజును పాస్‌వర్డ్‌గా వినియోగించుకోవచ్చు. ఓపెన్ అయిన వెంటనే స్క్రీన్‌పై స్కోర్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు.
ఈ నెల 6,8,10,11,12,13,15 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ రెండో సెషన్స్ పరీక్షలను నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలను రాశారు. ఈ నెల 19వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి 21వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఫైనల్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని 24వ తేదీన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.












Click it and Unblock the Notifications