జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్‌లోడ్ చేసుకోండిలా!

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ గురువారం విడుదలైంది.

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ గురువారం విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలసిందే. జేఈఈ పరీక్షలు నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఈ కీని తాజాగా విడుదల చేసింది.

ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీలతోపాటు ప్రశ్నాపత్రాలను అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించింది. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 4న రాత్రి 7.50 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో తమకు తెలపవచ్చునని పేర్కొంది.

 JEE Mains Answer Key 2023 for Session 1 released, download here

అభ్యంతరాలపై ప్రతి ప్రశ్నకు రూ. 200లు చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులు పరిశీలిస్తారని తెలిపింది. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవే అయితే.. ఆన్సర్ కీని సవరించి తుది కీ విడుదల చేస్తామని వెల్లడించింది. ఆ తర్వాత తుది ఫలితాలు విడుదల చేస్తాయని పేర్కొంది.

జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+