హైదరాబాద్‌లో రిసార్ట్ పాలిటిక్స్- ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నాల్లో రేవంత్
Champai Soren: కొద్ది రోజులుగా జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెర పడినట్టే కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో కొద్దిసేపటి కిందటే ఆయన ప్రమాణం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తనకు మద్దతు ఇస్తోన్న శాసన సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం రాజ్‌భవన్ వద్ద పరేడ్ సైతం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని గవర్నర్ సమక్షంలో నిరూపించుకున్నారు. దీనితో ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించారు.

చంపై సోరెన్‌తో పాటు మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన సత్యానంద్ భోక్తా, కాంగ్రెస్ సభ్యుడు ఆలంగిర్ ఆలం.. మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లో శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 మంది సభ్యుల బలం అవసరమౌతుంది. జేఎంఎం-30, కాంగ్రెస్-16, రాష్ట్రీయ జనతాళ్‌కు చెందిన ఒక సభ్యుడు.. అధికార కూటమికి మద్దతు ఇస్తోన్నారు. 47 మంది సభ్యుల బలంతో చంపై సోరెన్.. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 25 సభ్యుల బలం ఉన్న భారతీయ జనతా పార్టీ.. ప్రతిపక్షంలో కొనసాగుతోంది.
ఇప్పుడీ 47 మంది శాసనసభ్యులను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది జార్ఖండ్ ప్రభుత్వం. దీనికోసం వారిని హైదరాబాద్‌కు పంపించింది. జేఎంఎం సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక బస్సుల్లో వారిని షామీర్‌పేట్ రిసార్టుకు తరలించారు.
10 రోజుల పాటు వారంతా ఇక్కడే ఉండబోతోన్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ రోజున రాంచీకి తరలి వెళ్తారు. కాగా- ఈ పనులన్నింటినీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తోన్నారు. వారిని రిసార్టుకు తరలించే బాధ్యతలను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications