జియో బాటలో.. ఐడియా, ప్రీపెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్!
రిలయన్స్ జియో దెబ్బకు టెలికాం కంపెనీలకు దిగిరాక తప్పడం లేదు. ఇప్పటికే ఎయిర్ టెల్ జియో ఆఫర్ల లాంటివే యూజర్లకు అందిస్తోండగా.. తాజాగా ఐడియా కూడా ఇదే బాట పట్టింది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకు టెలికాం కంపెనీలకు దిగిరాక తప్పడం లేదు. ఇప్పటికే ఎయిర్ టెల్ జియో ఆఫర్ల లాంటివే యూజర్లకు అందిస్తోండగా.. తాజాగా ఐడియా కూడా ఇదే బాట పట్టింది.
ఐడియా కూడా రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందు కోసం తమ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ. 697తో రీఛార్జ్ చేసుకోవాలని, ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు మొత్తం 126 జీబీ డేటాను రోజుకి 1.5 జీబీ చొప్పున 84 రోజుల పాటు పొందవచ్చని పేర్కొంది.

దీంతో పాటు ఉచిత అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌ను కూడా పొందవచ్చని తన వెబ్‌సైట్‌లో తెలిపింది. టెలికాం మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో ఇతర అన్ని కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications