న్యూ ఇయర్ ప్లాన్స్: జియో, వొడాఫోన్ పోటా పోటీ ఆఫర్లివే

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఆఫర్లపై ఆఫర్లను ప్రకటిస్తోంటే ప్రత్యర్థి కంపెనీలు కూడ కొత్త ఆఫర్లతో ముందుకు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.జియోకు పోటీగా 2018 న్యూఇయర్ ఇయర్ ఆఫర్‌ను వొడాఫోన్ ప్రకటించింది.

జియో రంగ ప్రవేశంతో టెలికం కంపెనీలు టారిఫ్ ప్లాన్లను మార్చడంతో పాటు కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు రావాల్సిన పరిస్థితులతో ముందుకు వస్తున్నాయి. టెలికం కంపెనీలు పోటా పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

అయితే కస్టమర్లను ఇతర కంపెనీల వైపుకు వెళ్ళకుండా చూసుకోవాలనే ఉద్దేశానికి తోడు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి టెలికం కంపెనీలు

వొడాఫోన్ న్యూ ఇయర్ ఆఫర్

వొడాఫోన్ న్యూ ఇయర్ ఆఫర్

వొడాపోన్ రెండు కొత్త ఫ్లాన్లను ప్రకటించింది. రూ.198 ప్లాన్ అయితే, మరోకటి మాత్రం రూ.229. రూ. 198 ప్లాన్ లో తన కస్టమర్లకు రోమింగ్‌తో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజూ 1జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌ కేవలం వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తోంది. ఈ ఆఫర్ 28 రోజుల పాటు వాలిడిటీ ఉంటుందని వొడాపోన్ ప్రకటించింది.

రూ.229 ప్లాన్ ఇలా

రూ.229 ప్లాన్ ఇలా

రూ. 229 ప్లాన్ ద్వారా రోజుకు 1జీబీ డేటా, అపరమిత కాల్స్‌, ఉచిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్‌ చేస్తుంది. అయితే ఈ ప్లాన్‌ కేవలం వొడాఫోన్‌ కొత్త యూజర్లకు మాత్రమేనని వొడాపోన్ ప్రకటించింది

4జీ సర్కిల్స్‌కు మాత్రమే

4జీ సర్కిల్స్‌కు మాత్రమే

ఈ రెండు ప్లాన్లు వొడాఫోన్‌ 4జీ సర్కిల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయని వొడాఫోన్ ప్రకటించింది. జియో ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్లను లక్ష్యంగా చేసుకొని వొడాఫోన్ ఈ ఆఫర్లను ప్రకటించిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 జియో న్యూ ఇయర్ ప్లాన్స్

జియో న్యూ ఇయర్ ప్లాన్స్

జియో కూడ రూ. 199 , రూ.299 ప్లాన్స్ ను ఇటీవలనే ప్రకటించింది. నెల రోజుల పాటు ఉచిత వాయిస్‌, అపరిమిత డేటా అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు‌ ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది. రూ.299 ప్లాన్ కింద నెల రోజుల పాటు ఉచిత వాయిస్‌, అపరిమిత డేటా అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు వర్తించనున్నట్టు జియో ప్రకటించింది. జియో ప్రకటించిన ఈ ప్లాన్లకు పోటీగా వొడాఫోన్ ఈ రెండు కొత్త ఆఫర్లను ముందుకు తీసుకువచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+