త్వరలోనే భారత్‌లో 6జీ టెక్నాలజీ.. అభివృద్ధి దిశగా జియో ముందడుగు
ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే 5జీ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ప్రస్తుతం చాలా దేశాల్లో పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ రిలయెన్స్ జియో మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. 6 జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. ఇండియాలో 5జీ కంటే ముందే 6జీని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఓలు యూనివర్సిటీతో జియో ఒప్పందం
ఇందులో భాగంగానే ఇప్పటికే ఫిన్లాండ్‌లోని ఓలు యూనివర్సిటీతో జియో ఒప్పందం చేసుకుంది. రిలయెన్స్ జియోకు ఎస్టోనియా దేశంలో రీసెర్చ్ సెంటర్ ఉంది. ఈ రీసెర్చ్ సెంటర్ , ఓలు యూనివర్సిటీ కలిపి ఈ 6 జీ టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేయనున్నాయి. ప్రపంచంలో తొలుత 6జీ టెక్నాలజీపై రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను ఓలు యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అందుకే ఈ యూనివర్సిటీతో జియో ఒప్పందం కుదుర్చుకుంది.

5జీ టెక్నాలజీ అధారంగా 6జీ అభివృద్ధి
భారత్‌లో 5జీ టెక్నాలజీని విస్తరింపజేస్తూనే 6 జీ టెక్నాలజీపై పరిశోధనలు చేయనున్నారు. దీనిలో భాగంగా ఓలు యూనివర్సిటీ ఇప్పటికే 6 జీ టెక్నాలజీపై పనిచేస్తోంది. 5జీ టెక్నాలజీ అధారంగా 6జీ డెవలప్ చేస్తామని ఓలు యూనివర్సిటీ వెల్లడించింది. అలాగే 5 జీతో పాటు 6జీ సేవలు కూడా కొనసాగుతాయి కాబట్టి ఎక్కువ మంది కస్టమర్లకు ఈసేవలు ఉపయోగపడతాయని ఓలు యూనివర్సిటీ పేర్కొంది.

6 జీతో ఎక్కువ మొత్తంలో డేటా ట్రాన్స్ మీషన్
ప్రస్తుతం భారత్‌లో ఉన్న 40 కోట్ల యూజర్లకు డేటాను అనుసంధానం చేయడం అంత సులువైనది కాదన్నారు జియో ఎస్టోనియా సీఈవో టావీ కోట్కా. అందుకే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ 6 జీ టెక్నాలజీతో ఎక్కువ మొత్తంలో డేటాను ట్రాన్స్ మీషన్, స్పీడ్ కూడా పెరుగుతుందని వివరించారు. 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మెక్రో ఎలక్ట్రానిక్స్, స్పేస్, హోలో గ్రాఫిక్, సైబర్ సెక్యూరిటీలో 3డీ కనెక్టెడ్ ఇంటెలిజెన్స్ వంటి సేవలు బాగా పనిచేస్తాయని టావీ కోట్కా వెల్లడించారు. అలాగే వీటి లిమిట్‌ను పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications