Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సోరెన్, మొరబాదీ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకారం, రాహుల్, ప్రియాంక హాజరు..

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరబాదీ గ్రౌండ్‌లో మధ్యాహ్న 2 గంటలకు హేమంత్ సోరెన్ చేత గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి 47 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. హేమంత్ సోరెన్ బృందం ఈ నెల 24వ తేదీన గవర్నర్‌ని కలిసింది.

ఆ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి విపక్ష కూటమి నేతలు హాజరుకాబోతున్నారు. ఎన్డీఏ వ్యతిరేక కూటమి నేతలంతా ఒక్కచోటికి చేరి, ప్రభుత్వ వ్యతిరేక బలం చూపించబోతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా నేతలంతా హాజరవుతున్నారు.

jmm chief hemanth soren swearing in ceremony live updates

Dec 29, 2019, 2:44 pm IST

జార్ఖండ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా
Dec 29, 2019, 2:33 pm IST

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ కు శుభాకాంక్షలు తెలిపిన కేరళ సీఎం పినరయి విజయన్..
Dec 29, 2019, 2:30 pm IST

హేమంత్ సోరెన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆలంగీర్ ఆలం, రాజు
Dec 29, 2019, 2:30 pm IST

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 2013-2014లో ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు.
Dec 29, 2019, 2:23 pm IST

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ద్రౌపది ముర్ము. హిందీలో ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్.
Dec 29, 2019, 2:03 pm IST

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్ గఢ్)
Dec 29, 2019, 2:03 pm IST

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
Dec 29, 2019, 1:57 pm IST

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి రాంచీకి చేరుకున్న ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
Dec 29, 2019, 1:49 pm IST

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ గైర్హాజర్
Dec 29, 2019, 1:49 pm IST

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధిగా హాజరు కానున్న సంజయ్ సింగ్.
Dec 29, 2019, 12:50 pm IST

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరువనున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ .
Dec 29, 2019, 12:24 pm IST

జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హేమంత్ సోరెన్ .
Dec 29, 2019, 12:12 pm IST

జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హేమంత్ సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ, బిజీ షెడ్యూల్ వల్ల కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని వెల్లడి .
Dec 29, 2019, 11:33 am IST

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార వేదిక నుంచి తమ ఐక్యత చాటనున్న విపక్షాలు. హాజరవుతున్న ఆర్జేడీ తేజస్వి యాదవ్, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన ఉద్దవ్ థాకరే, ఎస్పీ అఖిలేశ్ యాదవ్, టీడీపీ చంద్రబాబు నాయుడు.
Dec 29, 2019, 11:07 am IST

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీఎంలు, విపక్ష నేతలు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి వస్తుండటంతో మొరబాదీ గ్రౌండ్‌ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు. అణువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న అధికారులు .
Dec 29, 2019, 10:43 am IST

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం .
Dec 29, 2019, 10:17 am IST

మరో మూడు పోర్టుపోలియోలు ఎవరికీ ఇస్తారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఒక్క సీటు గెలిచిన ఆర్జేడీకి అవకాశం లభిస్తోందా ? లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Dec 29, 2019, 9:33 am IST

హేమంత్‌ సోరెన్‌తోపాటు జార్ఖండ్ యూనిట్ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాన్, సీఎల్పీ నేత అలంగీర్ అలామ్, జేఎంఎం సీనియర్ నేత స్టీపెన్ మరాండీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఐఏఎన్ఎస్ మీడియా పేర్కొన్నది.
Dec 29, 2019, 9:04 am IST

జేఏంఎం ప్రభుత్వానికి మద్దతు తెలిపిన జేవీఎం, 50 మంది సభ్యులకు చేరిన హేమంత్ సోరెన్ బలం
Dec 29, 2019, 9:04 am IST

జవనరి 15వ తేదీన జార్ఖండ్ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం
Dec 29, 2019, 9:04 am IST

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహా ఏడుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం
Dec 29, 2019, 9:03 am IST

తనకు బోకెలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని ఇటీవల ప్రజలను కోరిన హేమంత్ సోరెన్.
Dec 29, 2019, 8:14 am IST

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక్కచోట విజయం
Dec 29, 2019, 8:14 am IST

ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఇటీవల విపక్షాలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ
Dec 29, 2019, 8:14 am IST

ఇవాళ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ హాజరయ్యే అవకాశం.
Dec 29, 2019, 7:44 am IST

కేంద్రమాజీమంత్రి పీ చిదంబరం, అహ్మాద్ పటేల్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం.
Dec 29, 2019, 7:44 am IST

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాగ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ హాజరవుతారు
Dec 29, 2019, 7:44 am IST

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఏంఎం-కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో జయకేతనం..
Dec 29, 2019, 7:44 am IST

25 సీట్లకే పరిమితమైన అధికార బీజేపీ.
Dec 29, 2019, 7:24 am IST

తూర్పు జంషెడ్‌పూర్ నుంచి సీఎం రఘుబర్ దాస్ ఓడిపోవడం విశేషం, తన మంత్రివర్గ సహచరుడు సరయూ రాయ్ చేతిలో ఘోర పరాజయం.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+