హోలీ పండుగపై జెఎన్‌యులో పోస్టర్, కలకలం (వీడియో)
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరోసారి వివాదాస్పద పోస్టర్ కలకలం సృష్టించింది. హోలీ పండుగ మహిళలకు వ్యతిరేకం అంటూ ఆ పోస్టర్‌లలో పేర్కొన్నారు. ఇటీవల జెఎన్‌యులో అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ ఓ సభను నిర్వహించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
తాజాగా, హోలీ మహిళలకు, ముఖ్యంగా దళిత మహిళలకు వ్యతిరేకం అని జెఎన్‌యులో పోస్టర్లు వెలిశాయి. హోలీ వేడుకల పేరుతో మహిళలను లైంగికంగా బాధించేందుకే దీనిని ఆనాడు తెరపైకి తెచ్చారని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

'వాట్ ఈజ్ హోలీ ఎబౌట్ హోలీ' పేరుతో ఈ పోస్టర్లు జెఎన్‌యు క్యాంపస్‌లో వెలిశాయి. ఈ పోస్టర్లను వర్సిటీలోనే కాకుండా మార్కెట్, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో వేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications