కమల్ హాసన్ తల నరికేస్తా.. ఆ నటుడు సంచలన వార్నింగ్
ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెదిరింపులు వచ్చాయి. కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ తల నరికేస్తానని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. దీంతో రవిచంద్రన్ పై కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిచంద్రన్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. తక్షణమే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు.
ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కు బెదిరింపులు వచ్చాయి. కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ తల నరికేస్తానని అన్నారు. దీంతో రవిచంద్రన్ పై మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు, రిటైర్డ్ ఐజీ మౌర్యా, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం మరింత ముదరకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇక అగరం ఫౌండేషన్ వేడుకలో కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఈ మేరకు సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేసే ఆయుధం విద్య అని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను రవిచంద్రన్ తో పాటు సనాతన ధర్మాన్ని పాటించేవారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక కమల్ హాసన్ కు ఇటీవల డీఎంకే రాజ్యసభ ఎంపీ సీటుని కేటాయించింది. గత లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కమల్ హాసన్ కు ఎంపీ సీటుని కేటాయించింది డీఎంకే. దీంతో ఇటీవలే ఆయన ఎంపిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
అటు రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ కమల్ హాసన్ బిజీగా ఉన్నారు. లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఆ తర్వాత వరుసగా పరాజయాలు చూశారు. భారతీయుడు 2, థగ్ లైఫ్ చిత్రాలు అంతగా ఆడలేదు. మరోవైపు కల్కి 2898ఏడీ మూవీలో కాసేపు కనిపించారు కమల్ హాసన్. ఇక రెండో పార్టులో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications