Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kamala Harris: కమలా హ్యారిస్ గురించి 11 ఏళ్ల క్రితం మల్లికా శెరావత్ చిలక జోస్యం, గోల్డెన్ టంగ్ !

ముంబాయి/ వాషింగ్టన్: తొలి ప్రవాస భారతీయురాలు కమలా హ్యారిస్ అమెరికాలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని, ఆమె అగ్రరాజ్యం అధ్యక్షురాలు అయ్యే అర్హతలు ఉన్నాయని 11 ఏళ్ల క్రితం బాలీవుడ్ హాట్ బామ, బహుబాష నటి మల్లికా శెరావత్ జోస్యం చెప్పింది. హాట్ బామ మల్లికా శెరావత్ ఏ టైమ్ లో చిలక జోస్యం చెప్పిందో ఏమోకాని ఈ రోజు కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యారు. నేను ఆ రోజు చెప్పింది ఈ రోజు నిజం అయ్యింది, నా టంగ్ గోల్డెన్ టంగ్ అంటూ మల్లికా శెరావత్ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. కమలా హ్యారిస్ తో మల్లికా శెరావత్ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 కమలా హ్యారిస్ గెలుపు భారతీయుల గెలుపు

కమలా హ్యారిస్ గెలుపు భారతీయుల గెలుపు

అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలు అయిన కమలా హ్యారిస్ ప్రవాస భారతీయురాలు అని ఇప్పుడు ప్రతిఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇక తమిళ తంబీలు అయితే మా అక్క కమలా హ్యారిస్ అంటూ కాలర్ ఎత్తుకుని తిరుగుతున్నారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి ప్రవాస భారతీయురాలు, తొలి నల్లజాతీయురాలు ఇలా కమలా హ్యారిస్ అనేక ప్రత్యేకతలను చాటుకున్నారు. కమలా హ్యారిస్ గెలుపు మనందరిది అంటూ భారీయులు అంటున్నారు.

 2009లో మల్లికా చిలక జోస్యం

2009లో మల్లికా చిలక జోస్యం

2009లో బాలీవుడ్ లో మల్లికా శెరావత్ ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలతో పాటు భారతదేశంలోని అనేక బాషల్లో నటించిన మల్లికా శెరావత్ కుర్రకారును ఓ ఊపుఊపేసింది. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను 2009 జూన్ 23వ తేదీన బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ కలిసి ఆమెతో ఫోటోలు తీయించుకున్నారు. కమలా హ్యారిస్ అమెరికాలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని, ఆమె కచ్చితంగా అగ్రరాజ్యం అధ్యక్షురాలు అవుతారని, ఎవ్వరూ ఊహించని పదవిని ఆమె దక్కించుకుంటారని ఆరోజు మల్లికా శెరావత్ చెప్పారు.

 నా టంగ్ గోల్డెన్ టంగ్...... చూశారా !

నా టంగ్ గోల్డెన్ టంగ్...... చూశారా !

కమలా హ్యారిస్ ను మల్లికా శెరావత్ అమెరికాలోనే కలిశారు. కమలా హ్యారిస్ అమెరికాలోని స్యాన్ ఫ్రావిసిస్కో డిస్ట్రిక్ అటర్నీగా పని చేస్తున్న సమయంలో ఆమెను మల్లికా శెరావత్ కలిశారు. ఆ రోజు కమలా హ్యారిస్ తో తీసుకున్న కొన్ని ఫోటోలను మల్లికా శెరావత్ 2009 జూన్ 23వ తేదీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అప్పుడు మల్లికా శెరావత్ కమలా హ్యారిస్ తో కలిసి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.

 మల్లికా మాటకు తిరుగేలేదు

మల్లికా మాటకు తిరుగేలేదు

ఎవ్వరూ ఊహించని పదవిలో కమలా హ్యారిస్ ఉంటారు, ఈ రోజు నేను మీకు చెబుతున్నా, మీరే చూడండి అంటూ మల్లికా శెరావత్ సోషల్ మీడియాలో 2009 జూన్ 23వ తేదీన పోస్టు చేసింది. కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలు అవుతారు, ఈ రోజు కమలా హ్యారిస్ ను కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, మహిళలు రాజ్యాలను పాలిస్తారని మల్లికా శెరావత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ రోజు మల్లికా శెరావత్ చెప్పిన జోస్యం ఈ రోజు దాదాపుగా జరిగింది.

 హాలీవుడ్ సినిమాల్లో మల్లికా శెరావత్

హాలీవుడ్ సినిమాల్లో మల్లికా శెరావత్

కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలు అవుతారని మల్లికా శెరావత్ 11 ఏళ్ల క్రితం చెప్పింది. అయితే కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యారు. చైనీస్ తోపా పలు హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి మల్లికా శెరావత్ ఆ రోజుల్లో విదేశాల్లో తెగ చక్కర్లు కొట్టేసింది. జాకీచాన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ హీరోల సినిమాల్లో మల్లికా శెరావత్ నిటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+