కన్నడ హీరో, నిర్మాత రామ్ ఆత్మహత్యాయత్నం

బెంగళూరు: కన్నడ నటుడు, నిర్మాత రామ్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. సినిమా మధ్యలో నిలిచిపోవడం, ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో ఆయన తన కార్యాలయంలో విషం సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

బెంగళూరు నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో రామ్ మృత్యువుతో పోరాడుతున్నాడు. రెండు రోజులు దాటితే తప్ప అతని ఆరోగ్యం విషయంలో తాము ఏమి చెప్పలేమని వైద్యులు అంటున్నారని దర్శకుడు కృష్ట చెప్పారు. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్ళికి చెందిన రామ్ చాల కాలం నుండి బెంగళూరులోని కత్రిగుప్పలో నివాసం ఉంటున్నాడు.

Kannada actor Ram attempts suicide, he admitted to private hospital

బెంగళూరు నగరంలోని సిద్దాపురలో 20 సంవత్సరాల నుండి రౌడియిజం రాజ్యం ఏలుతున్నది. ఇదే సిద్దాపుర పేరుతో రౌడియిజం నేపద్యంలో సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా హీరో రామ్. సినిమా 40 శాతానికి పైగా పూర్తి అయిన తరువాత ఆ సినిమా నిర్మాత శ్రీనివాస్ చేతులు ఎత్తివేశాడు.

సినిమా పూర్తి చెయ్యడానికి తన దగ్గర డబ్బులు లేవని బహిరంగంగానే చెప్పారు. తరువాత రామ్ తన కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు తీసుకుని అతనే నిర్మాత అయ్యాడు. అనుభవం లేకపోవడంతో చాల డబ్బులు వృధా అయ్యాయి. అయినా సినిమా పూర్తి కాలేదు.

చివరికి రామ్ తన స్నేహితులు, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి సినిమా పూర్తి చెయ్యాలని భావించాడు. అయినా అతని శ్రమకు తగ్గ ఫలితం చిక్కలేదు. ఆదివారం రాత్రి తన సొంత కార్యాలయంలో స్నేహితులతో కలిసి మాట్లాడుతున్న సమయంలో రామ్ విషం సేవించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+