రోడ్ షోలతో దుమ్ములేపుతున్న హీరో సుదీప్, కిచ్చా హవాతో ఫ్యాన్స్ కిచకిచా, లీడర్స్ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు ప్రచారం చెయ్యడానికి 10 రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో నాయకులు పోటాపోటీ పడుతున్నారు. ప్రముఖ హీరో, బహుబాష నటుడు కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో దుమ్ములేపుతున్నాడు. సుదీప్ అభిమానులు, బీజేపీ నాయకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
గురువారం ఉదయం హీరో కిచ్చా సుదీప్ కూడ్లగిలో రోడ్ షోలో పాల్గొని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో కొట్టూరు సమీపంలోని హెలిప్యాడ్ చేరుకున్న హీరో సుదీప్ కు బీజేపీ నాయకులు, ఆయన అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన హీరో సుదీప్ రోడ్ షోలో పాల్గొన్నారు.

కూడ్లగి బీజేపీ అభ్యర్థి లోకేష్ నాయక్ తరపున ఎన్నికల ప్రచారం చేసిన హీరో సుదీప్ ఆయన అభిమానులను పలకలించారు. లోకేష్ నాయక్ ను గెలిపించాలని హీరో సుదీప్ బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులకు మనవి చేశారు. గురువారం హీరో సుదీప్ బళ్లారి, హావేరి, రాణిబేన్నూరు. బ్యాడగి, కుందగూళ, సండూరులో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి షెడ్యూల్ ఖరారైయ్యింది.
ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఎక్కడెక్కడ హీరో సుదీప్ ఎన్నికల ప్రచారం చెయ్యాలో డిసైడ్ చేశారు. వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో అదే కులానికి చెందిన హీరో సుదీప్ తో ఎన్నికల ప్రచారం చేయించి ఆ కులం ఓట్లు బీజేపీకి పడేలా ఆ పార్టీ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారు.
వాల్మీకి కులం ఓటర్లతో పాటు హీరో సుదీప్ ఫ్యాన్స్ ఓట్లు పక్కకుపోకుండా బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించాలన్నా వాల్మీకి కులం ఓట్లు కీలకంగా మారాయి. అందుకే హీరో సుదీప్ తో పాటు వాల్మీకి కులానికి చెందిన మాస్ లీడర్, మంత్రి బళ్లారి శ్రీరాములుతో కూడా ఎన్నికల ప్రచారం చేయించడానికి బీజేపీ నాయకులు ప్లాన్ చేశారు.












Click it and Unblock the Notifications