VIPల కూతుర్లు టార్గెట్, తరువాత తల్లులకు వల, విదేశాలకు నగ్న వీడియోలు, సీబీసీఐడీ ఎంట్రీ ?, ఫినిష్ !
చెన్నై/కన్యాకుమరి: సోషల్ మీడియాలో సుమారు 100 మందికిపైగా అందమైన అమ్మాయిలు, ఆంటీలను పరిచయం పెంచుకుని వారితో రాసలీలలు సాగించి పోర్న్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన ప్లేబాయ్ కాశీ పాపం పండిపోయింది. కేసు సీబీసీఐడీకి అప్పగించాలని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. కొందరు VIPల కుమార్తెలను వలలో వేసుకుని పోర్న్ వీడియోలు తీసి తరువాత ఆ అమ్మాయిల తల్లులను బ్లాక్ మెయిల్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసు కస్టడీలో ప్లేబాయ్ కాశీ సంచలన విషయాలు బయటపెట్టడంతో ఈ దందాలో మిగిలిన వారిని అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం అవుతోందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

దిమ్మ తిరిగింది
సోషల్ మీడియాలో అమ్మాయిలను, వివాహిత మహిళలను టార్గెట్ చేసుకుని వారిని వలలో వేసుకుని వారితో రాసలీలలు సాగించిన తమిళనాడులోని నాగర్ కోవిల్ నివాసి కాశీ (26) వ్యవహారం రోజుకొకటి బయటకు వస్తోంది. కాశీ చెబుతున్న వాస్తవాలు తెలుసుకుంటున్న విచారణ పోలీసుల దిమ్మ తిరిగిపోయింది.

VIPల కూతుర్లు, భార్యలు ?
కాశీ చాలా మంది వీఐపీల అమ్మాయిలను వలలో వేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత వీఐపీల కుమార్తెలతో రహస్యంగా రాసలీలలు సాగించిన కాశీ ఆ సమయంలో పోర్న్ వీడియోలు, ఫోటోలు తీశాడు. తరువాత అమ్మాయిల ఫోటోలు, నగ్న వీడియోలు అడ్డంపెట్టుకున్న కాశీ, అతని స్నేహితులు తరువాత అమ్మాయిల తల్లులను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భారత్ టూ దుబాయ్
నాగర్ కోవిల్ ప్లేబాయ్ కాశీకి స్నేహితుడు అయిన గినో అనే యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గినో, దుబాయ్ లో ఉన్న కాశీ స్నేహితుడు గౌతమ్ కలిసి అమ్మాయిలు, వివాహిత మహిళల పోర్న్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దుబాయ్ లో తలదాచుకున్న కాశీ స్నేహితుడు గౌతమ్ ను భారత్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కాశీ బ్యాచ్ లో ఎంత మంది ?
అమ్మాయిలు, వివాహిత మహిళల పోర్న్ వీడియోలు కాశీ స్నేహితులు ఎంత మందికి షేర్ చేశారు ?, ఎన్ని వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు ? ఈ బ్యాచ్ లో ఎంత మంది ఉన్నారు ? అని కన్యాకుమరి జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాశీ తొట్టిబ్యాచ్ లో శ్రీమంతుల పిల్లలు ఉన్నారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ల్యాబ్ కు ల్యాప్ టాప్
ఇప్పటికే కాశీకి చెందిన ల్యాప్ టాప్ ను అతని స్నేహితుడి ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ లోని పోర్న్ వీడియోల ఆధారం పోలీసులు విచారణ చేశారు. కాశీకి చెందిన ల్యాప్ టాప్ ను కోర్టులో ఇచ్చామని, ఆ ల్యాప్ టాప్ ను ల్యాబ్ కు పంపించి మరింత సమాచారం సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

దెబ్బకు కేసు సీబీసీఐడీకి !
ప్లేబాయ్ కాశీ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుండటం, ఈ దందాలతో కొందరు వీఐపీలకు లింక్ ఉండటంతో ఆ కేసు విచారణ సీబీసీఐడీకి అప్పగించాలని కన్యాకుమారి జిల్లా ఎస్పీ శ్రీనాథ్ న్యాయస్థానంలో మనవి చేశారు. ఆరు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్న పోలీసులు కాశీని విచారణ చేసి వివరాలు సేకరించారు. కాశీని మరింత విచారణ చెయ్యాలని మొదట పోలీసులు బావించారు. అయితే కాశీ కేసు సీబీసీఐడీకి అప్పగించాలని కన్యాకుమారి జిల్లా ఎస్పీ శ్రీనాథ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లేనిపోని రామాయణం
ప్లేబాయ్ కాశీతో అనేక మంది వీఐపీలకు లింక్ ఉండటం, కేసు రోజుకొక మలుపు తిరుగుతుండటంతో ఎక్కడ వచ్చిన రామాయణం, ఈ కేసు సీబీసీఐడీకి అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేసు విచారణ చేస్తున్న అధికారులు నిర్ణయించారని తెలిసింది. మొత్తం మీద ప్లేబాయ్ కాశీ మొదట వీఐపీల అమ్మాయిలను వలలో వేసుకుని తరువాత వారి తల్లులను బ్లాక్ మెయిల్ చేశాడని వెలుగు చూడటంతో కాశీతో లింక్ ఉన్న కొందరు వీఐపీలు ఇప్పుడు హడలిపోతున్నారని తెలిసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications