'కేరళ కాశ్మీర్'.. కాంతల్లూర్ గ్రామం అందాలు చూసొద్దామా..?

కాశ్మీర్ అందాలను ఎంత వర్ణించినా తక్కువే.. కాశ్మీర్ ను భూమిపై ఉన్న స్వర్గంగా అభివర్ణిస్తారు. ఎటు చూసినా హిమాలయ పర్వతాలు, లోయలు, పచ్చని పచ్చిక బయళ్లు, ప్రశాంతమైన వాతావరణం, సరస్సులు, మంచుతో కప్పబడిన ప్రదేశాలు మరింత అందంగా ఉంటాయి. అయితే కాశ్మీర్ అందాలను చూసిన అనుభూతే కలిగేలా దక్షిణ భారతంలోని కేరళలో ఓ గ్రామం కనువిందు చేస్తోంది. కొండపై హిల్ స్టేషన్ మాదిరిగా ఉన్న ఈ చిన్న గ్రామం ఇప్పుడు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందమైన కొండల నడుమ ఉన్న గ్రామం పర్యటకులకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది.

కేరళలోని ఇదుక్కీ జిల్లాలో ఎత్తైన కొండల నడుమ ఉన్న ఈ గ్రామం పేరు కాంతాల్లూరు. ఈ గ్రామాన్ని కేరళ కాశ్మీర్ గా పిలుస్తారు. సముద్రమట్టానికి దాదాపు 5 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉన్న కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఈ హిల్ స్టేషన్ ఎత్తులో ఉన్నందువల్ల ఏడాదంతా చల్లటి వాతావరణంతో ఉంటుంది. ఇక శీతాకాలంలో అయితే ఇక్కడి ప్రకృతి మరింత అందంగా.. రమణీయంగా ఉంటుంది. దాంతో ఈ ప్రదేశం అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణతోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు.

కాంతాల్లూరు గ్రామంలో పండ్లతోటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఆపిల్, స్ట్రాబెరీ తోటలు పర్యటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి గ్రామీణ వాతావరణం, ప్రకృతితో మమేకమై జీవించే విధానం ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. బిజీ లైఫ్ ను గడిపి బోర్ కొట్టిన వాళ్లు ప్రశాంతమైన వాతావరణం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలోనే టూరిస్టుల కోసం చిన్న చిన్న హోమ్ స్టే లు.. పల్లెటూరి విధానంలో భాగంగా గుడిసెలు నిర్మించారు స్థానిక అధికారులు.

Kanthalloor The Real Kashmir of Kerala You ve Never Heard Of

ఈ ప్రాంతానికి చేరుకున్న పర్యటకులు మార్నింగ్ ట్రెక్కింగ్ లు, అటవీ ప్రాంతంలోని జలపాతాలు, వ్యూ పాయింట్లు, తదితర ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడకు సమీప విమానాశ్రయం కొచ్చి . అలాగే మున్నార్ నుంచి ఈ ప్రాంతం కేవలం 50 కి. మీ. దూరంలోనే ఉంటుంది. మున్నార్ ట్రిప్ లో భాగంగా చాలామంది కాంతాల్లూరు ను సందర్శిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు అనువైన సమయంగా భావిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+