Karnataka Assembly elections 2023:డైలీహంట్‌పై ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి కవరేజ్
కర్నాటక రాజకీయం వేడెక్కుతోంది. మే 10వ తేదీన 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరిగింది. ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 2613 మంది అభ్యర్థులు తమ భవితవ్యం తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 2427 మంది పురుషులు ఉండగా, 184 మంది మహిళలు, ఇద్దరు ఇతరులున్నారు.
గుర్తింపు పొందిన రాజకీయపార్టీల నుంచి చూస్తే...224 మంది అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీ చేయగా, 223 మంది కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. (ఒక సీటు మేల్కొటేలో సర్వోదయ కర్నాటక పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది). 207 మంది జేడీఎస్ అభ్యర్థులు, 209 మంది ఆప్ అభ్యర్థులు, బీఎస్పీ నుంచి 133 మంది, సీపీఐ(ఎం) నుంచి నలుగురు, జేడీయూ నుంచి 8 మంది అభ్యర్థులు ఎన్‌పీపీ నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. ఇక 685 మంది గుర్తింపు ఉన్న/అంతగా గుర్తింపు లేని పార్టీల నుంచి పోటీచేశారు. 918 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో దిగారు.

ఈ ఏడాది ఎన్నికల్లో 5,31,33,054 మంది రిజిస్టర్ అయిన ఓటర్లు ఉండగా.. ఇందులో తొలిసారిగా 16 లక్షల మంది ఓటు వేశారు. 80 ఏళ్లకు పైబడి వయసున్న వారు, దివ్యాంగులకు ఈసారి ఓటు ఇంటి నుంచే వేసే అవకాశం ఈసీ కల్పించింది.
డైలీ హంట్ పై కవరేజ్:
కర్నాటక ఎన్నికలు లైవ్‌తో సహా పూర్తి స్థాయిలో డైలీ హంట్ కవర్ చేస్తోంది.ఎన్నికలు కేవలం అంకెలతో మాత్రమే ముడిపడి ఉన్నాయనేది డైలీ హంట్ నమ్మదు.పూర్తి స్థాయి డేటా ఆధారంగా విశ్లేషించడం జరుగుతుంది.ఒక్కసారి ఫలితాలు రావడం ప్రారంభమయ్యాక, అన్ని కోణాల్లో సమగ్ర విశ్లేషణ ఇస్తాం. ఫలితాలపై డేటా సేకరించి ఫలితాలు ఎందుకు అలా వచ్చాయో విశ్లేషిస్తాం.

డైలీ హంట్‌కు లాగిన్ అయితే మీరు ఈ లాభాలు పొందుతారు:
లైవ్‌తో పాటు వేగవంతమైన ఎన్నికల అప్‌డేట్స్ చక్కటి టాబ్యులర్ ఫార్మాట్‌లో ఉంటాయి.
ఈ సారి ఫలితాలు గత ఫలితాలతో పోలుస్తూ విశ్లేషణలు
ఆయా నియోజకవర్గాల్లో సీట్ల మార్పులతో ఏ మేరకు ప్రభావం ఉందనేదానిపై అప్‌డేట్స్
సోషల్ మీడియాలో రియాక్షన్స్, ట్రెండ్స్, ట్విటర్ ట్రెండ్స్
లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ కథనాలు, వీడియోలతో డైలీ హంట్ పై మా ఎన్నికల కవరేజీ ఉంటుంది.












Click it and Unblock the Notifications