బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ కంపెనీలపై ఉగ్రవాదుల దాడి అంటూ ప్రచారం నమ్మకూడదు, బెంగళూరు పోలీసులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉగ్రవాదులు దాడులు చేస్తారనే వదంతులు నమ్మకూడదని సిటీ పోలీసులు మనవి చేశారు. బెంగళూరులో ఉగ్రవాదులు దాడులు చేస్తారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు విచారం వ్యక్తం చేశారు.

శ్రీలంకలో ఈస్టర్ పండుగ సందర్బంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లలో వందల మంది చనిపోయారు. వరుస బాంబు పేలుళ్లలో అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు జరిపిన ఉగ్రవాదులు ఇప్పుడు బెంగళూరు చేరుకున్నారని ఫేస్ బుక్, ట్వీట్టర్, వాట్సప్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

Karnataka:Bengaluru police requested not to circulate hoax messages on terrorist attack on it companies

నలుగురు ఉగ్రవాదులు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో, బెళ్లందూరులో మకాం వేశారని, వాళ్లు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలను టార్గెట్ చేసుకున్నారని కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. ఉగ్రవాదుల విషయంలో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వారిని చూసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొందరు సోషల్ మీడియాలో మనవి చేశారు.

బెళ్లందూరు పోలీసులు స్వయంగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారని కొందరు సోషల్ మీడియాలో వివరించారు. ఈ సందర్బంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి ప్రచారం నమ్మకూడదని బెంగళూరు పోలీసులు మనవి చేశారు.
ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యకూడదని, వాటి గురించి ఆలోచించకూడదని పోలీసులు మనవి చేశారు.

English summary
Bengaluru city police has requested citizens to not to believe hoax messages being circulated on terrorists attack on IT companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X