CM: అర్దరాత్రి జాతీయ జెండా ఎగరవేసిన సీఎం, పక్కన మంగ్లీ సిస్టర్స్, మంత్రి స్కెచ్ సూపర్ !

బెంగళూరు/బెళగావి: స్వాంతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు. పంచాయితీ పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో సోమవారం జాతీయ జెండాలు రెపరెపలాడాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జాతీయ జెండా ఎగరవేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఆదివారం అర్దరాత్రి 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి జాతీయ జెండా ఎగరవేశారు. అదే వేదిక మీద ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల సందర్బంగా వివిద సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన తరువాత వేదిక మీద జాతీయ జెండా ఎగరవేసిన సీఎం సింగర్ మంగ్లీ, ఆమె సోదరితో పాటు మంత్రి, సొంత పార్టీ నాయకులు. ప్రజలతో కలిసి జాతీయ జెండాను చేతపట్టుకుని గాల్లోలో ఊపుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

 ఢిల్లీ టూ గల్లిలో జాతీయ జెండాల రెపరెపలు

ఢిల్లీ టూ గల్లిలో జాతీయ జెండాల రెపరెపలు

స్వాంతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు. పంచాయితీ పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో సోమవారం జాతీయ జెండాలు రెపరెపలాడాయి. చిన్నాపెద్ద అని తేడాలేకుండా దాదాపు అందరూ జాతీయ జెండాలు చేతపట్టుకుని స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 అర్దరాత్రి జెండా ఎగరవేసిన సీఎం

అర్దరాత్రి జెండా ఎగరవేసిన సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆదివారం అర్దరాత్రి 12 గంటల సమయంలో జాతీయ జెండా ఎగరవేశారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం 18వ క్రాస్ లోని ప్రభుత్వ కాలేజ్ క్రీడా మైదానంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం బసవరాజ్ బోమ్మయ్ చీఫ్ గెస్ట్ గా హాజరైనారు.

 మంగ్లీ సిస్టర్స్ హంగామా

మంగ్లీ సిస్టర్స్ హంగామా

మల్లేశ్వరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇందిరావతి తదితరుల సంగీతకచేరి ఆకర్షణగా నిలిచింది. మంగ్లీ అండ్ టీమ్ సంగీత కచేరి బెంగళూరు ప్రజలను ఆకట్టుకునింది. స్థానిక ఎమ్మెల్యే, కర్ణాటక విద్యాశాఖా మంత్రి డాక్టర్ సీఎన్. అశ్వథ్ నారాయణ ఆధ్వర్యంలో మల్లేశ్వరంలో ఆదివారం రాత్రి స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరిగాయి.

 అర్దరాత్రి జాతీయ జెండా ఎగరవేసిన సీఎం

అర్దరాత్రి జాతీయ జెండా ఎగరవేసిన సీఎం

స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల సందర్బంగా మల్లేశ్వరంలో వివిద సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన తరువాత వేదిక మీద జాతీయ జెండా ఎగరవేసిన కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సాటి మంత్రి డాక్టర్ సీఎన్. అశ్వథ్ నారాయణ, ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరితో పాటు సొంత పార్టీ నాయకులు. ప్రజలతో కలిసి జాతీయ జెండాను చేతపట్టుకుని గాల్లోలో ఊపుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఆదివారం అర్దరాత్రి బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం ఊహించినదాని కంటే చాలా వైభవంగా జరిగాయని నిర్వహకులు సంతోషం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+