Budget: డీకే మీద పగతోనే సిద్దరామయ్య ఇలా చేశారు, బడ్జెట్ లో, బీవైవీ ఫైర్ !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి అయిన సిద్దరామయ్య శుక్రవారం విధానసౌధలోని అసెంబ్లీలో 2023-24వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 14వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం మినహా ఈ బడ్జెట్‌లో ప్రత్యేకత ఏమీ లేదని, ఈ బడ్జెట్ ప్రజలనే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కూడా నిరాశపరిచిందని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ఆరోపించారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, శికారిపుర బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయని అందరూ అనుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇచ్చిన 5 హామీలు పూర్తిగా అమలు చేయబడుతాయా ? అని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని బీవై. విజయేంద్ర ఆరోపించారు.

Karnataka CM Siddaramaiah introduced the budget with revenge on DK Shivakumar. BY Vijayendra.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్నీ హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ప్రజలు నిరాశకు గురయ్యారని బీవై విజయేంద్ర ఆరోపించారు. సాగునీటి వనరులకు భారీ మొత్తంలో నిధులు కేటాయించలేదని, మేకేదాటుకు రూ. 9, 000 కోట్లు, మహాదాయి ప్రాజెక్టుకు రూ. 3, 000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ బడ్జెట్ లో సీఎం సిద్దరామయ్య రెండు ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్‌పై పగ తీర్చుకోవడానికి ఆయన శాఖకు నిధులు కేటాయించలేదని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ఆరోపించారు.

Karnataka CM Siddaramaiah introduced the budget with revenge on DK Shivakumar. BY Vijayendra.

సిద్దరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ డీకే. శివకుమార్‌ మీద రివెంజ్ బడ్జెట్ అని బీవై. విజయేంద్ర ఆరోపించారు. అంతే కాకుండా గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుంటే జీఎస్టీ వసూళ్లు ఇంత ఎక్కువగా ఉండేవి కావు. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేది కాదని ఓవరాల్‌గా సిద్దరామయ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ కర్ణాటక ప్రజల అంచనాలను అందుకోలేక అందరిని నిరాశ పరిచిందని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+