నా ముందు ఆ ఎమ్మెల్యే బచ్చా, నేను మంత్రి, సీఎం అయ్యింది ఎప్పుడంటే, సీఎం !
బెంగళూరు: 1983 నేను ఎమ్మెల్యే అయ్యాను. 1985లో మంత్రి అయ్యాను. అప్పట్లో నన్ను ఎవరూ అలా పిలవలేదు, రాజకీయాల్లో హరీష్ పూంజా ఇంకా బచ్చా అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. హరీష్ పూంజా బీజేపీ నాయకులతో చిల్లర చేష్టలు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. కలెక్షన్ మాస్టర్ సీఎం ఆఫ్ కర్ణాటక అంటూ పోస్ట్ చేసిన హరీష్ పూంజాకు సీఎం సిద్ధరామయ్య జలక్ ఇచ్చారు.
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కు రూ. 60 కోట్లు ఇచ్చారనే ఆఫర్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ దీని గురించి మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సీటీ రవిని ప్రశ్నించాలని, దీని గురించి నాకు తెలియదని సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలోని మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే సమాచారం మాత్రం మాదగ్గర ఉందని, బీజేపీ ఆఫర్స్ గురించి తనకేమీ తెలియదని సీఎం సిద్దరామయ్య చెప్పారు.

కార్పొరేషన్ బోర్డు అధ్యక్షుల నియామకం గురించి సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ తొలి దశలో ఎమ్మెల్యేలను డైరెక్టర్లుగా చేస్తాం. రెండో దశలో కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నామని అన్నారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తి పూర్తి చేస్తామని సీఎం అన్నారు. కరువు నివారన కోసం కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి నిధులు కూడా రాలేదని, ఇప్పటికే మేము రెండు నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని సిద్దరామయ్య అన్నారు.
కేంద్ర బృందం వచ్చి కరువు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారని, 236 తాలూకాల్లో 116 తాలూకాలను కరువు పీడిత తాలూకాలుగా ప్రకటించారని సీఎం సిద్దరామయ్య అన్నారు. రూ 17, 910 కోట్లు కరువు ప్రాంతాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగామని అయినా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక గురించి పట్టించుకోలేదదని సిద్దరామయ్య ఆఱోపించారు. కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమచూపిస్తోందని, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించడం కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్:
సీఎం సిద్ధరామయ్యను ఫేస్‌బుక్‌లో కలెక్షన్ మాస్టర్ అంటూ కించపరిచే విధంగా పోస్ట్ చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ పూంజాపై బెళ్లంగడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. బెళ్లంగడి ఎమ్మెల్యే హరీష్ పూంజా తన ఫేస్‌బుక్ పేజీలో సీఎం సిద్ధరామయ్య, బెంగళూరులోని సీఎం నివాసం ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, కర్ణాటకకు చెందిన కలెక్షన్ మాస్టర్ సీఎం సిద్దరామయ్య అంటూ సీఎంరు ట్యాగ్‌లైన్ రాశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యను అవమానించారంటూ కాంగ్రెస్ నేత, మాజీ జిల్లా పంచాయతీ సభ్యుడు శేఖర్ బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే హరీష్ పూంజా మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications