Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka CM Swearing In Ceremony LIVE: కర్నాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

బెంగళూరు: కర్నాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సిద్ధరామయ్య ఆరాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లు హాజరుకాగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. ఈ వేదికపైనే కమల్‌హాసన్ కూడా కనిపించారు.కంఠీరవ స్టేడియం వేదికగా జరిగిన సిద్ధరామయ్య, డీకేశివకుమార్‌ల ప్రమాణస్వీకారంకు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక సిద్దరామయ్య ప్రమాణస్వీకారంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Karnataka CM Swearing In Ceremony

May 20, 2023, 2:45 pm IST

కర్నాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆ రాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్
May 20, 2023, 1:39 pm IST

బీజేపీ వద్ద డబ్బులు, పోలీసులు, అధికారం ఉన్నింది. వాటన్నిటీ ప్రజలు ఓడగొట్టారు: రాహుల్ గాంధీ
May 20, 2023, 1:38 pm IST

కర్నాటకలో కాంగ్రెస్ గెలవగానే చాలామంది రకరకాలుగా గెలుపుపై విశ్లేషణలు చేశారు.పేదలు, దళితులు, బడుగుబలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంది కాబట్టే ఈ విజయం సాధ్యమైంది: రాహుల్ గాంధీ
May 20, 2023, 1:08 pm IST

కర్నాటక కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన పరమేశ్వర,కేహెచ్ మునియప్ప,కేజే జార్జ్,ఎంబీ పాటిల్
May 20, 2023, 12:48 pm IST

కర్నాటక ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీకేశివకుమార్
May 20, 2023, 12:43 pm IST

కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య. సిద్ధరామయ్యతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ గెహ్లాట్
May 20, 2023, 12:42 pm IST

ప్రమాణస్వీకార కార్యక్రమం స్టేజ్ పై రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
May 20, 2023, 12:41 pm IST

ప్రజలకు అభివాదం చేస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్
May 20, 2023, 12:16 pm IST

సిద్ధరామయ్య, డీకేశివకుమార్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమంకు హాజరయ్యేందుకు కంఠీరవ స్టేడియంకు చేరుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్. స్టాలిన్‌కు స్వాగతం పలికిన డీకేశీ
May 20, 2023, 11:56 am IST

కర్నాటకలో కొత్త సీఎం డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు బెంగళూరుకు చేరుకున్న రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ. స్వాగతం పలికిన డీకే శివకుమార్
May 20, 2023, 11:06 am IST
కర్నాటక

కంఠీరవ స్టేడియంలోనికి వెళ్లడానికి 11 గంటల వరకు అనుమతి ఇచ్చిన పోలీసులు. స్టేడియం బయట భారీ సంఖ్యలో గుమికూడిన ప్రజలు.
May 20, 2023, 10:41 am IST
కర్నాటక

కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ ముఖ చిత్రాన్ని ఛాతీపై పచ్చబొట్టుగా వేయించుకున్న కార్యకర్త. డీకేశి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడానికి బెంగళూరుకు వచ్చినట్లు వెల్లడి.
May 20, 2023, 10:37 am IST
కర్నాటక

బెంగళూరు షాంగ్రిలా హోటల్‌లో బస చేసిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు. వారిని స్టేడియానికి తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన పోలీసులు.
May 20, 2023, 10:25 am IST
కర్నాటక

కిటకిటలాడుతున్న కంఠీరవ స్టేడియం. ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి ప్రత్యేక వాహనాల్లో స్టేడియానికి చేరుకుంటోన్న వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు.
May 20, 2023, 10:16 am IST
కర్నాటక

బెంగళూరు కంఠీరవ స్టేడియానికి చేరుకుంటోన్న వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు. స్టేడియం వద్ద భారీ సంఖ్యలో గుమికూడిన అభిమానులు.
May 20, 2023, 10:03 am IST
కర్నాటక

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు వెల్లడించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్.
May 20, 2023, 9:39 am IST
కర్నాటక

ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తల సందడి.
May 20, 2023, 9:38 am IST
కర్నాటక

ఇవ్వాళ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు డాక్టర్ జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నా
May 20, 2023, 9:36 am IST
కర్నాటక

ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తల సందడి. సంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలను మోగిస్తోన్న కళాకారులు.
May 20, 2023, 9:13 am IST
కర్నాటక

బెంగళూరులో కంఠీరవ స్టేడియానికి దారి తీసే అన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించిన ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ మళ్లింపు, పలు మార్గాల మూసివేత. వీఐపీ వాహనాలకు మాత్రమే అనుమతి.
May 20, 2023, 8:35 am IST
కర్నాటక

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బెంగళూరు నగర వ్యాప్తంగా విస్తృతంగా వెలసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు.
May 20, 2023, 8:30 am IST
కర్నాటక

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి లక్షన్నర మందికి పైగా నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని అంచనా. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు.
May 20, 2023, 8:16 am IST
కర్నాటక

ప్రమాణ స్వీకారం నాడు ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నందున కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలను రాసే అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసిన అధికారులు.
May 20, 2023, 7:57 am IST
కర్నాటక

కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు వెల్లడించిన ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే
May 20, 2023, 7:48 am IST
కర్నాటక

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కంఠీరవ స్టేడియం ముస్తాబయింది. లక్షన్నర మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి.
May 20, 2023, 7:27 am IST
కర్నాటక

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికైన కంఠీరవ స్టేడియం వద్ద భారీ బందోబస్తు. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు.
May 20, 2023, 7:23 am IST
కర్నాటక

జగదీష్ షెట్టార్ సహా కర్ణాటక మంత్రులుగా 28 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.
May 20, 2023, 7:20 am IST
కర్నాటక

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి పూర్తయిన ఏర్పాట్లు
May 19, 2023, 5:45 pm IST

శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం
May 19, 2023, 5:43 pm IST

ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+